ETV Bharat / offbeat

వంకాయ పచ్చి కారం - రొటీన్​గా కాకుండా వెరైటీగా చేసుకోండిలా! - VANKAYA PACHI KARAM RECIPE

-పక్కా గ్రామీణ తెలంగాణ వంటకం -వేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి టేస్ట్ సూపర్

Vankaya Pachi Karam Recipe in Telugu
Vankaya Pachi Karam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 16, 2024, 2:16 PM IST

Vankaya Pachi Karam Recipe in Telugu: వంకాయలతో రకరకాల కూరలు, పచ్చళ్లు చేసుకుంటారు. ఇప్పటివరకు వంకాయ ఫ్రై, బజ్జీ, బిర్యానీ వంటివి చేసుకుని తిని ఉంటారు. కానీ ఇప్పుడు వెరైటీగా వంకాయ - పచ్చి కారం కర్రీని ట్రై చేయండి. ఇది పక్కా గ్రామీణ తెలంగాణ వంటకం. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ ట్రై చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుందీ కూర. అంతేకాదు.. ఈ కూరను చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నం లేదా జొన్న రొట్టెలతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • పావు చెంచా మెంతులు
  • పావు కప్పు పల్లీలు (వేరుశనగలు)
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక టేబుల్ స్పూన్ నువ్వులు
  • ఒక టేబుల్ స్పూన్ నూనె
  • ఒక ఉల్లిపాయ తరుగు
  • 4 పచ్చిమిరపకాయలు
  • అర టీ-స్పూన్ పసుపు
  • పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు
  • పావు కప్పు పెరుగు
  • ఒక టీ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్
  • పావు కప్పు నూనె
  • 10 వంకాయలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ పాన్​లో మెంతులు, పల్లీలు వేసి లో-ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • పల్లీలు వేగాక ఇందులో జీలకర్ర, నువ్వులు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత దింపేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి.
  • పచ్చివాసన పోయాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఆ తర్వాత పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, పెరుగు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (అవసరమైతే మధ్యలో నీళ్లు కూడా కలుపుకోవచ్చు)
  • పాన్​లో పావు కప్పు నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ముందుగానే శుభ్రంగా కడిగి మధ్యలోకి నాలుగు ముక్కలుగా చీల్చుకున్న వంకాయలను వేసి వేగనివ్వాలి.
  • ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో మెత్తగా మగ్గేవరకు ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ-పచ్చిమిర్చీ పేస్ట్, పల్లీలు- నువ్వులు పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • అనంతరం ఇందులో 200 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి మరోసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో దగ్గరపడేవరకు ఉడికించుకోవాలి. (మధ్యమధ్యలో కలుపుతూ ఉంచాలి. లేకపోతే అడుగు పడుతుంది)
  • కూర ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు చల్లుకుని స్టౌ ఆఫ్ చేస్తే.. టేస్టీ వంకాయ పచ్చి కారం రెడీ!

10 నిమిషాల్లో తెలంగాణ స్పెషల్ చుక్కకూర తొక్కు- వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతమే!

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.