Rayalaseema Style Spicy Mutton Fry: మటన్.. ఈ పేరు వింటేనే చాలా మంది ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురుచూస్తుంటారు. ఇక సండే వచ్చిందంటే కచ్చితంగా ఇంట్లో వండాల్సిందే. అయితే.. మటన్‌ను తీరొక్క రీతిలో చేసుకుంటారు. పులుసు, కూర, ఫ్రై, గోంగూర మటన్, చుక్కకూర మటన్, మటన్ ధమ్ బిర్యానీ.. ఇలా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వండుకుంటుంటారు. చాలా మంది మటన్ పులుసుగా వండుతుంటారు. కానీ.. ఫ్రై చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. అది కూడా రాయలసీమ స్టైల్లో ట్రై చేస్తే.. మసాలా ఘాటు నాషాళానికి ఎక్కాల్సిందే. మరి, ఈ రెసిపీ ఎలా చేయాలో ఒక లుక్కేయండి..
మటన్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు:
- లేత మటన్ - అరకిలో
- అల్లం వెల్లులి పేస్టు - 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- కారం- 2 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - 1 టీస్పూన్
- నీరు - తగినంత
నాన్‌వెజ్ స్పెషల్ : టేస్టీ టేస్టీ మ్యాంగో మటన్ కర్రీ.. ఒక్కసారి తిన్నారంటే వావ్ అనాల్సిందే
వేపుడు కోసం
- నూనె - తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఎండు మిర్చి - 4
- పచ్చిమిర్చి - 3
- గరం మసాలా - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం:
- ముందుగా మటన్ ముక్కలను ఓ గిన్నెలో వేసుకుని కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నూనె వేసి ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి సుమారు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.
- మూడు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మటన్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత మటన్‌లోకి 300ml నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అరకప్పు నూనె పోసుకుని వేడి అయ్యాక రెండు రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
- అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉడికించిన మటన్ నీళ్లతో సహా పోసుకుని.. మీడియం ఫ్లేమ్ మీద నీళ్లు ఇగిరిపోయేంతవరకు కలుపుతూనే వేయించుకోవాలి.
- 15 నిమిషాలకి ముక్కలు వేగి నీరు ఇంకిపోయి నూనె పైకి తేలుతుంటుంది. అప్పుడు మరోసారి బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి.
- దింపే ముందు కొత్తమీర తరుగు, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే. ఎంతో రుచికరంగా, కారంగా ఉండే రాయలసీమ స్టైల్ మటన్ వేపుడు రెడీ.
జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్‌తో సహా నాకేస్తారు!
వీకెండ్ స్పెషల్ - చింతచిగురు మటన్ ! ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!