ETV Bharat / offbeat

అద్దిరిపోయే "రాగి సూప్"​​- ఇలా చేస్తే సూపర్ టేస్ట్! పైగా ఆరోగ్యం బోనస్​!​ - ragi soup recipe in telugu - RAGI SOUP RECIPE IN TELUGU

Ragi Soup: చాలా మందికి సూప్​లు తాగడం అలవాటు. అందుకోసం బయట మార్కెట్లో లభించే ఇన్​స్టంట్​ పౌడర్స్​ తెచ్చుకుని సూప్​లాగా చేసుకుని తాగుతుంటారు. అయితే బయట నుంచి తెచ్చుకునే వాటి వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లోనే రాగులతో సూప్​ చేసుకుంటే టేస్ట్​కు టేస్ట్​.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఆ సూప్​ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Ragi Soup Recipe In Telugu
Ragi Soup Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 12:28 PM IST

Ragi Soup Recipe in Telugu: వర్షాకాలంలో.. ఒకవైపు వాన చినుకులు.. మరోవైపు చలితో జనం వణికిపోతుంటారు. ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఏదైనా తినాలని లేదా తాగాలని కోరుకుంటారు. అందుకోసం కొందరు బజ్జీ, పకోడి లాంటి స్నాక్స్​ తింటే.. మరికొందరు ఛాయ్​, ఇంకొందరు వేడివేడిగా సూప్స్​ చేసుకుని తాగుతుంటారు. ఇక సూప్స్​ అంటే మార్కెట్లో ఇన్​స్టంట్​ పౌడర్స్​ చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే అలాంటివేమి లేకుండా.. ఇంట్లోనే రాగులతో సూప్​ చేసుకుంటే టేస్ట్​కు టేస్ట్​.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకెందుకు లేట్​ వేడివేడిగా.. హెల్దీ, హాట్​ రాగి సూప్​ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • రాగి పిండి - ఒక కప్పు
  • కూరగాయలు(క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్) - 1 కప్పు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టీ స్పూన్​
  • సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టీ స్పూన్​
  • వెన్న లేదా నెయ్యి - ఒక స్పూన్​
  • మిరియాలపొడి - 1/2 స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిలికిన పెరుగు - పావు కప్పు

తయారీ విధానం

  • ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని.. దానికి రెట్టింపు నీటిని పోయాలి.
  • నీరు పోశాక బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత కూరగాయలను సన్నగా కట్​ చేసుకుని అన్నింటిని 1 కప్పు వచ్చేలా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో వెన్న లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
  • తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించాలి.
  • ఆ తర్వాత క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్ లాంటి మిక్స్‌డ్ వెజిటేబుల్స్ వేసి మీడియంఫ్లేమ్​లో వేయించాలి. (ఏదైనా ఇతర కూరగాయలు మీకు నచ్చినవి వేసుకోవచ్చు)
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి, కూరగాయలు సగం ఉడికేంత వరకు ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత 1/2 కప్పు నీరు వేసి, కూరగాయలను కాసేపు ఉడికించాలి.
  • కూరగాయలు ఉడికేటప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ వేగించాలి.
  • ఆ తర్వాత ముందు కలిపిపెట్టుకున్న రాగి మిశ్రమాన్ని పోసుకోవాలి.
  • మరీ చిక్కగా ఉంటే కొంత నీటిని సర్దుబాటు చేసుకొని కాసేపు ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేయండి.
  • కాస్త వేడి తగ్గే వరకు ఆగి చల్లారిన తర్వాత 1/4 కప్పు చిలికిన పెరుగు కలపండి.
  • ఆ తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని కలుపుకోండి. అంతే మీకు నచ్చిన హెల్తీ రాగి సూప్ రెడీ. వేడిగా సర్వ్ చేయండి.

పప్పు రుబ్బే బాధలేదు - ఇలా చేస్తే నిమిషాల్లోనే అద్దిరిపోయే రాగి వడలు రెడీ - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం! - Ragi Vada Recipe

శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి! - Bellam Paramannam Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.