How To Make Pudina Chutney : పుదీనా అనగానే ఏదైనా కూరల్లో సువాసన కోసం.. చివర్లో లుక్ కోసమో వేస్తుంటాం. పుదీనా ఆకులు వాసన చూస్తేనే చాలు.. ఎంత చిరాకులో ఉన్నా సరే, రీఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఉదయం లేవగానే తాగే ఛాయ్ నుంచి చట్నీ వరకు.. మజ్జిగ, సలాడ్స్ ఇలా మనం తీసుకునే ఏదో ఒక ఆహారం లేదా పానీయంలో పుదీనా తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి పుదీనాతో చేసే పచ్చడిని ఎప్పుడైనా తిన్నారా?
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పెరుగు అన్నంలో కూడా ఇది మంచి కాంబినేషన్. ఇలా కేవలం అన్నంతోనే కాకుండా అన్ని బ్రేక్ ఫాస్ట్‌లకు కూడా అద్భుతంగా ఉంటుంది. రోటీ, చపాతీ, పుల్కాల్లోకి కూడా బాగుంటుంది. ఇదే కాకుండా పుదీనాను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టేస్టీ పుదీనా తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కట్ట పుదీనా
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- 8 పచ్చిమిరపకాయలు
- 8 వెల్లుల్లి ముక్కలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- కరివేపాకు రెబ్బలు
- ఉసిరికాయంత చింతపండు
- ఒక ఉల్లిపాయ ముక్కలు
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం..
- ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా నీటిలో కడిగి.. కట్ చేసుకోవాలి.
- అనంతరం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె పోసుకోవాలి
- ఆ తర్వాత పచ్చిమిర్చీ, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసుకోని మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- అందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, కరివేపాకు, చింతపండు వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి.
- అనంతరం ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు వేసి నీరు పోయకుండానే లైట్‌గా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.(తొక్కు పచ్చడి కాబట్టి ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు)
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు! - Aloo Vada Recipe