ETV Bharat / offbeat

స్వీట్​ షాప్​ స్టైల్​ "పల్లీ పకోడి" ఇకపై ఇంట్లోనే - ఈ టిప్స్ పాటిస్తే సూపర్ - How to Prepare Crunchy Palli Pakodi - HOW TO PREPARE CRUNCHY PALLI PAKODI

Palli Pakoda: ఈవెనింగ్​ టైంలో క్రంచిగా ఏదో ఒక స్నాక్​ తినాలనిపిస్తుంది.. అటువంటి సమయంలో అందరూ తేలికగా చేసుకునేది ఉల్లిపాయ పకోడి. అయితే ఎప్పుడూ అదే కాకుండా ఈసారికి పల్లీ పకోడి చేయండి. రుచి చెప్పక్కర్లేదు..

Palli Pakoda
Palli Pakoda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 1:53 PM IST

How to Make Sweetshop Style Palli Pakodi: సాయంత్రం అయితే వేడివేడిగా కరకరలాడే పకోడి తింటోంటే కలిగే మజానే వేరు. అయితే పకోడీలు అంటే ఉల్లిపాయతో చేసేవి, పాలకూరతో చేసేవి గుర్తొస్తాయి. మరికొంతమంది పల్లీలతో కూడా పకోడి చేస్తుంటారు. కానీ అవి బయట షాపుల్లో కొన్నంత టేస్టీగా రావు. అందుకే ఈ టిప్స్​ పాటించండి.. సేమ్ హోటల్​ స్టైల్ పల్లీ పకోడి తీరుగా పర్ఫెక్ట్​గా వస్తాయి. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

మసాలా పల్లీ పకోడికి కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - 200 గ్రాములు
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • ఉప్పు - రుచికి సరిపడా
  • శనగపిండి - పావు కప్పు
  • బియ్య పిండి - పావు కప్పు
  • కారం - ముప్పావు చెంచా
  • గరం మసాలా- పావు చెంచా
  • చాట్​ మసాలా - పావు చెంచా
  • నిమ్మరసం - అర చెక్క
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా

బియ్యం పిండితో కాదు.. అటుకులతో కరకరలాడే జంతికలు! - సూపర్ స్నాక్​

తయారీ విధానం:

  • ముందుగా మిక్సీ జార్​ తీసుకుని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, 1 చెంచా నీరు వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ ప్లేట్​లోకి పల్లీలు తీసుకోవాలి. ఆ పల్లీల్లో వెల్లుల్లి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యప్పిండి, శనగ పిండి, కారం, గరం మసాలా, చాట్​ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా మాత్రమే నీళ్లు చిలకరించుకుని పల్లీలకు మసాలా మొత్తం పట్టే విధంగా గట్టిగానే కలుపుకోవాలి.
  • నీళ్లు ఎక్కువ పోసి జోరుగా కలుపుకుంటే పల్లీలను నూనెలో వేసినప్పుడు పిండి సపరేట్​ అవుతుంది. పిండి గట్టిగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి.
  • నూనె బాగా కాలుతున్నప్పుడు స్టౌ లో-ఫ్లేమ్​లో పెట్టి పల్లీలను విడివిడిగా వేసుకోవాలి.
  • పల్లీలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఓ నిమిషం తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి అప్పుడు పల్లీలను గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చిన తర్వాత స్టౌ హై-ఫ్లేమ్​లో పెట్టి ఓ నిమిషం పాటు వేయించుకుని ప్లేట్​లోకి తీసుకుంటే సరి.
  • కావాలనుకుంటే కరివేపాకును కూడా నూనెలో వేయించుకుని పల్లీలలో కలుపుకోవచ్చు.
  • అంతే.. ఎంతో రుచికరంగా ఉండే పల్లీ పకోడీ రెడీ. దీనిని వేడి మీద తింటే కాసింత మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి చల్లారిన తర్వాత తింటే కరకరలాడుతూ సూపర్​గా ఉంటాయి. నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి..

ఎలాంటి సాస్​ లేకుండా "వెజ్​ మంచూరియా" ఇంట్లోనే - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతుంది!!

వెడ్డింగ్​ స్టైల్​​ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్​ క్రిస్పీ అండ్​ టేస్ట్​ గ్యారెంటీ!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.