ETV Bharat / offbeat

ఇంట్లోనే అద్భుతమైన పావ్​భాజీ బర్గర్ - స్ట్రీట్​ ఫుడ్​ అంత టేస్టీగా.. అంతకు మించిన హెల్తీ​గా! - how to prepare pav bhaji in telugu

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 3:32 PM IST

నోరూరించే స్ట్రీట్‌ ఫుడ్‌లో ఒకటైన పావ్​ భాజీ అంటే అందరికీ ఇష్టమే! కానీ పరిశుభ్రంగా లేని ప్రదేశంలో.. ఏవేవో పదార్థాలతో.. ఏ చేతులతో చేస్తారో తెలియని ఆహారం తినడం ఎందుకు చెప్పండి? ఇంట్లోనే కాస్త ఓపికగా చేసుకుంటే.. టేస్టీగా, హెల్దీగా బయట దొరికే వాటికంటే బెస్ట్​ పావ్​ భాజీని రెడీ చేసుకోవచ్చు. మరి.. ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Prepare Pav Bhaji In Telugu
How To Prepare Pav Bhaji In Telugu (ETV Bharat)

How To Prepare Pav Bhaji In Telugu : పావ్​ భాజీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఇది దేశంలో ఎక్కడికి వెళ్లినా రోడ్లపై కనిపిస్తుంటుంది. అయితే.. చాలా మంది ఇది ఇంట్లో చేసుకునే పదార్థం కాదులే అని.. బయటికి వెళ్లి తింటుంటారు. కానీ.. అక్కడ పరిస్థితులు అంత శుభ్రంగా ఉన్నట్టు కనిపించవు. అందుకే.. చక్కగా ఇంట్లోనే ఈజీగా పావ్​ భాజీ బర్గర్ తయారు చేద్దాం. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 2 టేబుల్​ స్పూన్ల నూనె
  • 4 టేబుల్​ స్పూన్ల వెన్న
  • అర టీ స్పూన్​ జీలకర్ర
  • ఒక టీ స్పూన్​ అల్లం తరుగు
  • 2 టీ స్పూన్ల వెల్లుల్లి తరుగు
  • పావు కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిరపకాయల తరుగు
  • రుచికి సరిపడా ఉప్పు
  • పావు కప్పు స్వీట్ కార్న్​
  • పావు కప్పు సన్నని క్యాప్సికం తరుగు
  • అరకప్పు టమాటా సన్నని తరుగు
  • అర టీ స్పూన్​ కశ్మీరీ కారం(లేకపోతే మనది వేసుకోవాలి)
  • ఒక టీ స్పూన్ వేపిన ధనియాల పొడి
  • ఒక టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి
  • పావు టీ స్పూన్ గరం మసాలా
  • ఒకటిన్నర టేబుల్​ స్పూన్ల పావ్ భాజీ మసాలా
  • ఒక పెద్ద బంగాళదుంప
  • కొత్తిమీర తరుగు
  • రెండు బర్గర్​ బన్​లు
  • కాసింత ఛాట్​ మసాలా
  • క్యాబెజీ తరుగు
  • తురిమిన ఛీజ్​
  • మయనీజ్​

తయారీ విధానం..

  • ముందుగా భాజీ తయారీ కోసం స్టౌ వెలిగించి కడాయి పెట్టాలి.
  • అది కాస్త వేడయ్యాక నూనె, వెన్న వేసుకోవాలి. (వెన్న వేస్తేనే భాజీకి టేస్ట్ వస్తుంది)
  • అందులోనే జీలకర్ర, అల్లం, వెల్లులి తరుగు వేసి మెత్తగా వేగనివ్వాలి.
  • ఆ తర్వాత సన్నగా తురిమిన ఉల్లిపాయ, పచ్చిమిర్చీని వేసుకొని రెండు నిమిషాలు వేగనివ్వాలి.
  • అనంతరం ఉప్పు, స్వీట్ కార్న్​ వేసి కలిపి సుమారు 6 నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత మూత తీసి క్యాప్సికం, టమాటా తరుగు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
  • టమాటా మెత్తగా అయ్యాక కశ్మీర్ కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, పావ్​ భాజీ మసాలా వేసుకొని కలపాలి.
  • ఆ తర్వాత ఉడకబెట్టిన బంగాళ దుంపలు వేసి బాగా కలపాలి.
  • అనంతరం పావు కప్పు నీటిని పోసి మసాలా, దుంపలు కలిసేలా నాలుగు నిమిషాల పాటు బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఇందులోనే కొత్తిమీర, వెన్న వేసి కాసేపు ఉడికించాలి.
  • చివరగా చీజ్​ను తురిమి వేసి భాజీని దించేయండి.
  • అనంతరం రెండు బర్గర్​ బన్​లను తీసుకుని మధ్యలోకి కట్ చేయండి
  • మరో స్టౌ వెలిగించి పెనంపై వెన్నను వేసుకోవాలి. అది వేడయ్యాక కట్​ చేసిపెట్టుకున్న బర్గర్​ బన్​లను పెట్టి మీడియం ఫ్లేమ్​లో కాసేపు కాలనివ్వండి. (వెన్న ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచిగా ఉంటుంది)
  • అనంతరం బర్గర్​ బన్​లపై అర అంగుళం మందంతో భాజీని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి.
  • ఆ తర్వాత దానిపై ఉల్లిపాయలు ముక్కలు, ఛాట్​ మసాలా, క్యాబెజ్​ తురుము, ఛీజ్​ వేసుకోండి.
  • మరో బన్​ ముక్కపై మయనీజ్​ను వేసుకోని.. భాజీ ఉన్న బన్​పై పెట్టుకోవాలి.
  • చివరగా ఛీజ్​ను తురుము వేసుకుని హాట్ టమాటో కెచప్​తో తింటే సూపర్​గా ఉంటుంది.

పిల్లల లంచ్​ బాక్స్​లోకి టేస్టీ "పెప్పర్​ రైస్" - ఇలా చేశారంటే డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తారు! - Pepper Rice In Telugu

సండే స్పెషల్​ : రాయలసీమ స్టైల్​ స్పైసీ "మటన్​ వేపుడు" - ఇలా ప్రిపేర్ చేశారంటే మసాలా ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే! - Rayalaseema Style Spicy Mutton Fry

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.