ETV Bharat / offbeat

స్పెషల్ లంచ్​ రెసిపీ: "ఘుమఘుమలాడే పులావ్, అదుర్స్​ అనిపించే ఆలూ కుర్మా​"- ఇలా చేస్తే రుచి అద్భుతం! - PULAO AND ALOO KURMA RECIPE

-బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? -ఇవి ఓ సారి ప్రిపేర్​ చేయండి!

How to Make Pulao
How to Make Pulao (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 3:03 PM IST

How to Make Pulao : అప్పుడప్పుడు రొటీన్​గా కూరలు వండుకుని తినకుండా.. లంచ్​లోకి ఏదైనా స్పెషల్​ రెసిపీ చేసుకుని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఘుమఘుమలాడే పులావ్, ఆలూ కుర్మా ట్రై చేయండి. ఈ రెండు రెసిపీలను బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ​సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి వీటి ప్రిపరేషన్​కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పులావ్​ కోసం కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి బియ్యం- కప్పు (అరగంట నానబెట్టుకోవాలి)
  • నూనె-టేబుల్ స్పూన్​
  • నెయ్యి-టేబుల్ స్పూన్​
  • దాల్చిన చెక్క
  • ఒక అనాస పువ్వు
  • కొద్దిగా జాపత్రి
  • లవంగాలు-3
  • అర టీస్పూన్ షాజీరా
  • ఒక నల్ల యాలక
  • బిర్యానీ ఆకులు-2
  • అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
  • పచ్చిమిర్చి-4
  • గరం మసాలా-అర టీస్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-టేబుల్​స్పూన్​
  • టమాటా-1
  • కొత్తిమీర, పుదీనా తరుగు-కొద్దిగా

పులావ్​ తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై పులావ్​ చేయడం కోసం గిన్నె పెట్టండి. నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, నల్ల యాలక, షాజీరా వేసి కలపండి.
  • మసాలా దినుసులు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
  • తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అలాగే టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
  • తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్​ వేయండి. గిన్నెలో రెండుకప్పుల వాటర్​ పోసి కలపండి.
  • రైస్​లో గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి గిన్నెపై మూత పెట్టి పులావ్​ పొడిపొడిగా వండుకోండి.
  • అంతే ఇలా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే పులావ్​ రెడీ.

How to Make Aloo Kurma : ఇప్పుడు ఆలూ కుర్మా ఎలా చేయాలో చూద్దాం..

ఆలూ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 3
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • దాల్చినచెక్క - చిన్నది
  • యాలకులు - 2
  • లవంగాలు - 3
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్
  • కరివేపాకు - 2
  • పెరుగు - పావు కప్పు
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - అరటీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • గరంమసాలా పౌడర్ -అరటీస్పూన్
  • కసూరీ మేథి - టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా పొటాటోలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. తర్వాత వాటిపై పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను సన్నగా కట్​ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఆలూ కుర్మా చేయడం కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి లైట్​గా ఫ్రై చేయాలి.
  • తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలపాలి. ఉల్లిపాయలు గోల్డెన్​ కలర్లో వేగిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి.
  • అల్లం పచ్చివాసన పోయిన తర్వాత పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నూనె సెపరేట్ అయ్యేంత వరకు మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కలిపి స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
  • ఆలూ కుర్మా చిక్కగా అయిన తర్వాత గరంమసాలా పౌడర్, కసూరీ మేథి వేసుకొని బాగా కలిపి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి.. స్టౌ ఆఫ్​ చేయండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే "ఆలూ కుర్మా" రెడీ!

ఆరోగ్యాన్నిచ్చే "అల్లం పెరుగు పచ్చడి" - సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!

ఊతప్పం మరింత టేస్టీగా - ఈ పొడితో ప్రిపేర్ చేస్తే కేక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.