ETV Bharat / offbeat

"మసాలా వడ" అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేస్తే సూపర్ క్రిస్పీగా వస్తుంది! - MASALA VADA RECIPE

- ఈ టిప్స్ పాటిస్తే ఎంతో టేస్టీ

Masala Vada
How to Make Masala Vada (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 9:49 AM IST

How to Make Masala Vada : సాయంత్రం​ టీ-టైమ్​లో సమోసా, పకోడి, మిర్చీ బజ్జీ​ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కాస్త కారంగా ఏదైనా స్నాక్​ రెసిపీ తిని.. వేడివేడి టీ/కాఫీ తాగితే ఆ ఫీల్​ చాలా బాగుంటుంది. అయితే.. ఇంట్లో ఎప్పుడూ రొటీన్​గా పకోడి, బజ్జీ కాకుండా ఇలా మసాలా వడలు ట్రై చేయండి. మేం చెప్పినట్టు మసాలా వడలు చేస్తే.. అచ్చం రోడ్​ సైడ్​ బండి మీద లభించేంత టేస్టీ​గా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, అందరికీ ఇష్టమైన క్రిస్పీ అండ్​ టేస్టీ మసాలా వడలు ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చి శనగపప్పు-కప్పు
  • పల్లీలు-పావుకప్పు
  • ఉల్లిపాయ తరుగు -అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిన్న దాల్చినచెక్క
  • లవంగాలు-4
  • పసుపు - చిటికెడు
  • ధనియాలు- టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • ఎండుమిర్చి-2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కరివేపాకు
  • అల్లం ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • పుదీనా
  • ఆయిల్ - తగినంత

తయారీ విధానం..

  • ముందుగా ఒక గిన్నెలోకి పచ్చి శనగపప్పు, పల్లీలు తీసుకోవాలి. వీటిని
  • శుభ్రంగా కడిగి, ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. మసాలా వడల్లోకి పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్​ చాలా బాగుంటాయి.
  • తర్వాత మిక్సీ జార్లోకి ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇందులోకి నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోసుకోకూడదు. (వడల పిండి కాస్త గట్టిగా ఉంటేనే మసాలా వడలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.)
  • ఇప్పుడు వడల పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి పిండిని బాగా మిక్స్​ చేయాలి.
  • ఇప్పుడు వడలు డీప్​ ఫ్రై చేయడానికి స్టౌ మీద కడాయి పెట్టండి. ఇందులో ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • నూనె వేడైన తర్వాత చేతికి ఆయిల్​ రాసుకుని వడలు చేసుకుని ఆయిల్లో వేయండి.
  • ఒక నిమిషం తర్వాత గరిటెతో తిప్పుతూ రెండు వైపులా బాగా కాల్చుకోండి.
  • మిగిలిన పిండితో ఇలానే వడలు చేసుకుంటే సరి.
  • ఎంతో రుచికరమైన కరకరలాడే మసాలా వడలు రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఈ స్నాక్​ రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

ఎప్పుడూ పానీపూరీ, పునుగులేనా? - ఈ సారి "మటర్ కుల్చా" ట్రై చేయండి - అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్!

ఫ్రెంచ్ ఫ్రైస్ బయట తింటున్నారా? - ఈ టిప్స్​తో ట్రై చేస్తే ఇంట్లోనే రెస్టరెంట్​ స్టైల్! - పైగా ఎంతో టేస్టీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.