ETV Bharat / offbeat

ఎన్నో పోషకాలున్న మఖానాతో "టేస్టీ మసాలా కర్రీ"- ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది!! - MAKHANA MASALA CURRY IN TELUGU

-స్పెషల్స్​ కోరుకునే వారికి బెస్ట్​ ఆప్షన్​ -ఈ పద్ధతిలో వండితే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా రుచి

Makhana Masala Curry
Makhana Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 22, 2024, 10:19 AM IST

Makhana Masala Curry: హెల్దీ స్నాక్​ ఐటమ్స్​లో తామర గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఫూల్‌ మఖానాగా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులంటున్నారు. అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, స్వీట్లలో భాగం చేసుకుంటారు. అయితే, ఇవే కాకుండా ఈ మఖానాతో ఎంతో రుచికరమైన మసాలా కర్రీ కూడా ప్రిపేర్​ చేసుకోవచ్చు. వేడివేడి అన్నం, చపాతీలు, పుల్కా.. ఇలా ఎందులోకైనా ఈ రెసిపీ అద్దిరిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా మఖానా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మఖానా-50 గ్రాములు
  • టమాటలు -2
  • ఉల్లిపాయలు-2
  • బిర్యానీ ఆకు- 1
  • షాజీరా-అరటీస్పూన్​
  • ఉప్పు రుచికి సరిపడా
  • గసగసాలు-అరటీస్పూన్​
  • జీడిపప్పు-పావుకప్పు
  • నూనె
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టేబుల్​స్పూన్​
  • కరివేపాకు-2
  • పచ్చిమిర్చి-3
  • పసుపు-చిటికెడు
  • కారం- టేబుల్​స్పూన్​
  • గరం మసాలా-టీస్పూన్​
  • పెరుగు -పావు కప్పు
  • కసూరీ మేథీ- కొద్దిగా

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్​ చేసి పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేయాలి. నూనె వేడైన తర్వాత మఖానా వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
  • అలాగే గసగసాలను నీటిలో నానబెట్టుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్​లో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత బిర్యానీఆకు, షాజీరా వేసి వేయించండి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్​లో వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను ప్లేట్​లోకి తీసుకుని స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి టమాటా ముక్కలు, నానబెట్టుకున్న జీడిపప్పు కొన్ని, గసగసాలు, పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని పాన్​లో వేసి బాగా మిక్స్​ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయి నూనె పైకి తేలెంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలపండి.
  • తర్వాత గరం మసాలా, కారం వేసి నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు పెరుగు వేసి మిక్స్​ చేయండి. తర్వాత గ్రేవికి సరిపడా వాటర్​ పోసి కర్రీని ఉడికించండి.
  • గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత వేయించుకున్న మఖానా వేసి బాగా మిక్స్ చేయండి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పులు, కొద్దిగా కసూరీ మేథీ చల్లుకుని మూత పెట్టాలి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరి. ఎంతో రుచికరమైన మఖానా మసాలా కర్రీ మీ ముందుంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ విధంగా మఖానాతో సరికొత్త రెసిపీ ట్రై చేయండి.

హోటల్లో దొరికే సూపర్ టేస్టీ సాంబార్.. ఇప్పుడు మీ ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఘుమఘుమలాడిపోద్ది

వంకాయ పచ్చి కారం - రొటీన్​గా కాకుండా వెరైటీగా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.