ETV Bharat / offbeat

టిఫెన్ సెంటర్​ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది! - Idli Podi in Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : 1 hours ago

Best Idli Podi : వేడివేడి ఇడ్లీలకు చట్నీతోపాటు కారంపొడి కాంబినేషన్​గా ఉన్నాయంటే.. ఒకటికి రెండు ఇడ్లీలు తింటాం. అయితే.. టిఫెన్ సెంటర్లో మాత్రమే ఈ కారం పొడి సూపర్​గా ఉంటుంది. ఇంట్లో తయారు చేస్తే మాత్రం అంత రుచి రాదు. కొన్ని టిప్స్ పాటిస్తే.. అచ్చం అలాంటి టేస్ట్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Best Idli Podi
Best Idli Podi (ETV Bharat)

How to Make Idli Podi Recipe : చాలా మంది.. వేడివేడి ఇడ్లీలను చట్నీతోపాటు కారంపొడితో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. రోడ్​సైడ్​ టిఫెన్ బండిపైనా, టిఫెన్​ సెంటర్లలో ఇడ్లీలను తప్పకుండా చెంచా కారంపొడి వేసి ఇస్తుంటారు. ఇడ్లీలను పల్లీ చట్నీతోపాటు కారం పొడితో కలిపి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఇలాంటి కారంపొడిని ఇంట్లో తయారు చేయాలంటే.. అందరికీ సరిగా కుదరదు. దీంతో.. ఏం చేయాలో తెలియక నిరాశకు గురవుతుంటారు. అలాంటి వారికోసమే ఈ సూపర్ రెసిపీ. ఇక్కడ చెప్పినట్టు కారంపొడి తయారు చేస్తే.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. మరి.. దీన్ని ఎలా చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • శనగపప్పు-కప్పు
  • మినప్పప్పు- అరకప్పు
  • బ్యాడిగి మిర్చి-8
  • ఎండుమిర్చి-8
  • నువ్వులు-2 టేబుల్​స్పూన్లు
  • పుట్నాల పప్పు-3 టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు-2
  • ఇంగువ-2 చిటికెళ్లు
  • వెల్లుల్లి రెబ్బలు-12

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్ పెట్టి శనగపప్పు వేసి సన్నని మంట మీద దోరగా వేయించండి. శనగపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో మినప్పప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. పప్పులను ఇలా విడివిడిగా ఫ్రై చేసుకుంటేనే పప్పులు బాగా వేగుతాయి. పప్పులను సన్నని మంటమీద మాత్రమే ఫ్రై చేసుకోవా​లని గుర్తుంచుకోండి. ఇంకా ఇలా వేపుకుంటేనే పొడి చాలా రుచిగా ఉంటుంది.
  • అదే పాన్​లో కాస్త నువ్వుల నూనె వేసి బ్యాడిగి మిర్చి, ఎండుమిర్చి వేసి వేపుకోండి. మీ దగ్గర బ్యాడిగి మిర్చి లేకపోతే కారం గల ఎండుమిర్చి 15 వేసుకుని ఫ్రై చేసుకోండి.
  • మిర్చిల నుంచి పొగ వస్తున్నప్పుడు నువ్వులు వేసి కలపండి. నువ్వులు చిట్లిన తర్వాత పుట్నాలపప్పు, కరివేపాకు వేసి వేపండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని.. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి రవ్వలాగా గ్రైండ్​ చేసుకోండి. అంతే ఇలా రెడీ చేసుకుంటే.. ఇడ్లీ పొడి రెడీ.
  • ఇడ్లీ పొడి ఇలా చేస్తే కనీసం రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది.
  • వేడివేడి ఇడ్లీలలో కాస్త నెయ్యి వేసుకుని.. ఈ పొడితో కలిపి తింటే టేస్ట్ అమృతంలా ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ పొడి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

వేడివేడి అన్నంలోకి నల్ల కారం పొడి - కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా అనాల్సిందే! - ఇలా ప్రిపేర్ చేయండి - How to Make Nalla Karam in Telugu

నోరూరించే కారప్పొడులను ట్రై చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.