ETV Bharat / offbeat

పెళ్లిలో వడ్డించే "మటన్​ దాల్చా" టేస్ట్ వేరే లెవల్! - ఆ రుచి ఇంట్లో కూడా కావాలా? - ఇలా ప్రిపేర్ చేయండి! - Mutton Dalcha Recipe - MUTTON DALCHA RECIPE

Hyderabad Wedding Style Mutton Dalcha Recipe : పెళ్లి భోజనాల్లో వడ్డించే మటన్​ దాల్చా టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ రుచిని ఇంట్లో ట్రై చేద్దామంటే అంత పర్ఫెక్ట్​గా రాదు! అందుకే మీ కోసం ఈ రెసిపీ తెచ్చాం. దీన్ని ఫాలో అయితే.. దాల్చా రుచి అచ్చం పెళ్లిలో తిన్నట్టుగానే ఉంటుంది.

Mutton Dalcha Recipe
Hyderabad Wedding Style Mutton Dalcha Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 10:36 AM IST

Mutton Dalcha Recipe in Telugu : మటన్​ కర్రీ అందరూ చేస్తారు. కానీ, ఎప్పుడూ ఒకేలా తింటే బోర్​ అనిపిస్తుంది. అందుకే.. ఈసారి పెళ్లిలో వడ్డించే మటన్ దాల్చా ట్రై చేయండి. హైదరాబాద్​ వెడ్డింగ్ స్టైల్​ మటన్​ దాల్చా సింప్లీ సూపర్బ్ అని చెప్పాల్సిందే. అయితే.. చాలా మంది ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసినప్పటికీ, అంత పర్ఫెక్ట్​గా రాదు. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే అద్దిరిపోయే దాల్చా ప్రిపేర్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కేజీ మటన్
  • కందిపప్పు-కప్పు
  • శనగపప్పు-కప్పు
  • 8 పచ్చిమిరపకాయలు
  • ఉల్లిపాయలు
  • అర చెంచా పసుపు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర
  • పుదీనా - కొద్దిగా
  • గరం మసాలా - 1 టీస్పూన్​
  • లవంగాలు - 3
  • దాల్చినచెక్క
  • యాలకులు-4
  • బిర్యానీ ఆకులు- 2
  • చెంచా- కారం
  • రుచికి సరిపడా ఉప్పు
  • వాటర్ - సరిపడా

దాల్చ కోసం..

  • సొరకాయ
  • నూనె
  • చింతపండు నిమ్మకాయ సైజు
  • ఆవాలు
  • జీలకర్ర
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయ
  • పసుపు- పావు చెంచా
  • ఉప్పు
  • కారం-2చెంచాలు
  • ధనియాపొడి-చెంచా
  • జీలకర్ర పొడి
  • ఒక చెంచా- గరం మసాలా

తయారీ విధానం..

  • ముందుగా కందిపప్పు, శనగపప్పు శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.
  • అలాగే చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. సొరకాయని ముక్కలుగా కట్​చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి ఆయిల్​ వేయండి. ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి వేపండి.
  • తర్వాత మటన్​ వేసి కలపండి. ఇందులో పసుపు, టేబుల్​స్పూన్ కారం, ఉప్పు వేసి కలపండి. ఇందులో నీళ్లు పోసుకుని సన్నని మంటమీద మటన్​ మెత్తగా ఉడికించుకోండి.
  • మటన్​ ఉడికిన తర్వాత ఇందులో కందిపప్పు, శనగపప్పు వేయండి. మరికొన్ని నీళ్లు పోసి పప్పు ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత మెదుపుకోండి. ఈ మటన్​ కర్రీని స్టౌపై నుంచి తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు మరొక గిన్నెలో ఆయిల్​ వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలపండి. ఇందులో సొరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
  • తర్వాత చింతపండు రసం పోయండి. అలాగే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలపండి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని మటన్​ కర్రీలో కలపండి. అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే వెడ్డింగ్​ స్టైల్​ మటన్​ దాల్చా కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

"ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!

మటన్​ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.