ETV Bharat / offbeat

రాయలసీమ స్టైల్​ వెల్లులి కారం పచ్చడి - సువాసనకే మౌత్ వాటరింగ్ అయిపోతుంది! - Garlic Chutney Recipe

Rayalaseema Style Garlic Chutney Recipe : చాలామందికి ఇంట్లో ఎన్ని కూరలు వండినా కూడా వేడివేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకుని తింటేనే తృప్తిగా ఉంటుందని అంటుంటారు. మీకు కూడా ఇలానే రకరకాల పచ్చళ్లు తినే అలవాటు ఉందా ? అయితే, ఈ స్టోరీ మీకోసమే! కారంగా ఎంతో రుచికరంగా ఉండే రాయలసీమ పద్ధతిలో వెల్లుల్లి కారం పచ్చడి ఎలా చేయాలో ఈ కథనంలో చూద్దాం.

Garlic Chutney Recipe
How To Make Garlic Chutney Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 1:12 PM IST

How To Make Garlic Chutney Recipe : ఎందుకో ఏమో కానీ అప్పుడప్పుడూ ఇంట్లో ఏ కర్రీ వండినా కూడా అస్సలు తినాలనిపించదు. వేడివేడి అన్నంలోకి కారంగా ఉండే వెల్లుల్లి కారం పచ్చడి వేసుకుని తినాలనిపిస్తుంది. స్పైసీగా, కాస్త ఘాటుగా ఉండే పచ్చిడితో తింటే నోటికి రుచి తగులుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పచ్చడిని ఒక్కోచోట ఒక్కో విధంగా చేస్తారు. మీకు కూడా వెల్లుల్లి పచ్చడి అంటే చాలా ఇష్టమా..? అయితే, ఎంతో రుచికరంగా రాయలసీమ స్టైల్లో పచ్చడిని ఎలా చేయాలో చూసేయండి.

ఈ విధంగా వెల్లుల్లి పచ్చడి చేశారంటే, వేడి వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ, దోశల్లోకి చట్నీలాగా కూడా తినొచ్చు. అలాగే దీన్ని తయారు చేయడానికి ఎక్కువసేపు కూడా పట్టదు! కేవలం 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే టేస్టీ వెల్లుల్లి కారం పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయ-1
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు-100 గ్రాములు
  • ఎండు మిర్చిలు-10/ 12
  • చింత పండు-కొద్దిగా
  • నీళ్లు -కొద్దిగా
  • ఉప్పు -రుచికి సరిపడా

తాళింపు కోసం..

  • ఆవాలు- టీస్పూన్​
  • మినపప్పు-టీస్పూన్
  • కరివేపాకు
  • వెల్లుల్లి రెబ్బలు-5
  • ఎండుమిర్చిలు-2

వెల్లుల్లి కారం పచ్చడి తయారీ విధానం :

  • ముందుగా మూకుడులో కొద్దిగా ఆయిల్​ వేసి ఉల్లిపాయను కట్​ చేయకుండా.. అలానే పైన ఎర్రగా, లోపల మెత్తగా ఉడికే వరకు వేయించండి.
  • తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద గోల్డెన్​ బ్రౌన్​ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఎండుమిర్చిలు, చింతపండు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి.
  • ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో తాళింపు కోసం కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, కరివేపాకు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, రెండు ఎండుమిర్చిలు వేసి ఎర్రగా వేపుకోండి.
  • తాళింపు ఎర్రగా వేగిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్​ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది.
  • కారంగా ఎంతో రుచికరంగా ఉండే వెల్లుల్లి కారం పచ్చడి మీ ముందు ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి టేస్ట్​ అద్దిరిపోతుంది. అలాగే మీరు ఇడ్లీ, దోశ టిఫెన్లలోకి కూడా తినొచ్చు.
  • సరిగ్గా చేస్తే.. ఈ పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

గుంటూరు స్టైల్​ "గోంగూర ఉల్లిపాయ పచ్చడి"- ఇలా చేశారంటే మెతుకు మిగల్చరు! - ప్లేట్లు కూడా నాకేస్తారు!

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.