ETV Bharat / offbeat

షుగర్​, బరువును అదుపులో ఉంచే "క్యారెట్ కొబ్బరి జొన్న రొట్టెలు" - సింపుల్​గా చేసుకోండిలా! - CARROT COCONUT JOWAR ROTI

జొన్న రొట్టెలను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

Jowar Roti
Carrot Coconut Jowar Roti (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 6:44 PM IST

Carrot Coconut Jowar Roti Recipe : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా డైలీ డైట్​లో జొన్నలను భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు రోజు వారి ఆహారంలో జొన్న రొట్టెలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమందికి డైలీ జొన్న రొట్టెలను ఒకేవిధంగా తినాలంటే కాస్త బోరింగ్​గా అనిపిస్తుంది. అలాంటి వారికోసమే ఒక సూపర్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "క్యారెట్ కొబ్బరి జొన్నరొట్టెలు".

వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! పైగా ఈ రొట్టెలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ కంట్రోల్​లో ఉండాలనుకునేవారు జొన్న రొట్టెలను ఇలా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఈ రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి - రెండు కప్పులు
  • మొక్కజొన్న పిండి - చెంచా
  • ఆయిల్ - 4 చెంచాలు
  • ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
  • పచ్చిమిర్చి ముక్కలు - 1 టేబుల్​స్పూన్
  • సన్నగా తరిగిన అల్లం - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • పాలకూర తరుగు - పావు కప్పు
  • కొబ్బరి తురుము - 2 టేబుల్​స్పూన్లు
  • క్యారెట్ తురుము - 2 టేబుల్​స్పూన్లు
  • వాము - పావు చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా

జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఈ సీక్రెట్‌ టిప్స్‌ పాటిస్తూ చేస్తే చపాతీ కంటే సూపర్​ సాఫ్ట్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో రెసిపీలోకి కావాల్సిన పైన చెప్పిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్నపిండి, మొక్కజొన్నపిండి, ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్, కొబ్బరి తురుము, పాలకూర, కొత్తిమీర తరుగు, వాము, ఉప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు కట్టకుండా పిండిని కలుపుకొని పావుగంట పాటు పక్కన ఉంచాలి.
  • పావు గంట తర్వాత పిండిని మరోసారి కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద అరిటాకు లేదా పాలిథిన్ కాగితం ఉంచి దాని మీద ఒక్కో ఉండను తీసుకొని చేత్తో మెదుపుతూ కాస్త మందపాటి రొట్టెలుగా చేసుకోవాలి. అయితే, పిండిలో ఉల్లిపాయ, క్యారెట్, కొబ్బరి వంటి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి రొట్టె అనేది కాస్త పల్చగా రాదనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నాక స్టౌపై పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పెనం వేడయ్యాక కాస్త నూనె అప్లై చేసుకుని రెండు వైపులా మంచిగా కాలే వరకు కాల్చుకుంటే సరి. అంతే.. నోరూరించే "క్యారెట్ కొబ్బరి జొన్నరొట్టెలు" రెడీ!
  • అయితే, ఈ రొట్టెల తయారీకి అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి వాడినందున వీటిని తినడానికి పల్లీ పచ్చడి, కొబ్బరి చట్నీ, ఇంకేదైనా కర్రీ వంటి లేకున్నా డైరెక్ట్​గా తినేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి!

బరువు, షుగర్​ను కొట్టే ఫుడ్​ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్​ వేరే లెవల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.