ETV Bharat / offbeat

ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు! - How To Make Aloo Palak - HOW TO MAKE ALOO PALAK

Aloo Palak Recipe : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వారంలో కనీసం రెండు మూడు రోజులైనా వీటిని తప్పకుండా తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే.. సింపుల్​గా వండితే పిల్లలకు పెద్దగా నచ్చదు. అందుకే.. పాలకూర, బంగాళాదుంప కాంబినేషన్​తో అద్దిరిపోయే "ఆలూ పాలక్​ కర్రీ" ప్రిపేర్ చేసేయండి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Aloo Palak
Aloo Palak Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 10:43 AM IST

How To Make Aloo Palak Recipe : ఆకు కూరలతో కావాల్సినం ఆరోగ్యం లభిస్తుంది. ఆలుగడ్డలో కావాల్సినంత టేస్ట్ దొరుకుతుంది. ఈ రెండిటినీ మిక్స్ చేసి ప్రిపేర్​ చేసే.. సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాం. అదే ధాభా స్టైల్​ "ఆలూ పాలక్​ కర్రీ". దీనిని ప్రిపేర్​ చేయడానికి పెద్దగా సమయం అవసరం లేదు. ఎక్కువగా పదార్థాలు కూడా అవసరం లేదు. కానీ.. రుచి మాత్రం అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నోరూరించే ఆలూ పాలక్​ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర - 200 గ్రాములు
  • ఎండుమిర్చి-4
  • నూనె
  • జీలకర్ర- టేబుల్​స్పూన్​
  • ఉల్లిపాయ-1
  • ఉప్పు రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్​స్పూన్​
  • బంగాళా దుంపలు-పావుకేజీ
  • వెల్లుల్లి-5
  • పచ్చిమిర్చి-3
  • కారం- టీస్పూన్​
  • ధనియాలపొడి-టీస్పూన్​
  • జీలకర్రపొడి-టీస్పూన్​
  • నెయ్యి- 2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా పాలకూర ఆకులను తెంపి శుభ్రంగా రెండు మూడు సార్లు నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మరొక పాత్రలో బంగాళాదుంపలను ఉడికించాలి. వాటిపైన ఉన్న పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పాన్​లో నీళ్లు పోసి వేడిచేయాలి. తర్వాత పాలకూర ఆకులు వేసి 4 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ఆకులను స్ట్రెయినర్​ సహాయంతో వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేసుకోవాలి.
  • ఇలా పాలకూరను కూల్​ వాటర్​లోకి తీసుకోవడం ద్వారా, కర్రీ రంగు మారదు.
  • పాలకూరని ఉడికించిన నీటిని తిరిగి ఉపయోగించకండి.
  • పాలకూర ఆకులను మిక్సీ జార్లో వేసుకుని, కాసిన్ని నీళ్లు కలిపి మెత్తని ఫ్యూరీలాగా (పేస్ట్)​ చేసుకోవాలి.
  • ఇప్పుడు పాన్​లో ఆయిల్​ పోసి ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్​ చేయండి.
  • తర్వాత పాలక్​ ఫ్యూరీ వేసి మూత పెట్టి ఉడికించండి. నూనె పైన కనిపించేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి సన్నని మంటమీద 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆఫ్​ చేయడానికి ముందు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన ధాభా స్టైల్​ ఆలూ పాలక్ కర్రీ మీ ముందు సిద్ధంగా ఉంటుంది.
  • మీరు కూడా ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.

ఇవి కూడా చదవండి:

ఆహా అనిపించే 'కట్టా ఆలూ'.. వండేయండిలా..

ఎప్పుడైనా వంకాయ బజ్జీ కర్రీ తిన్నారా?- రాయలసీమ స్టైల్​లో తిన్నారంటే వావ్ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.