ETV Bharat / offbeat

టమాటాలను ఇలా నిల్వ చేసుకుంటే - త్వరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయట!

టమాటాలు త్వరగా పాడవుతున్నాయా? - ఇలా స్టోర్ చేసి చూడండి చాలా రోజులు నిల్వ ఉంటాయి!

TOMATOES STORAGE TIPS
Tips to Keep Tomatoes for Long Time (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Tips to Keep Tomatoes for Long Time : ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో ఒకటి టమాటా. వీటితో నేరుగా వంటకాలు చేసుకోవడమే కాదు.. మిగతా ఏ కర్రీ చేసుకున్నా కూడా చాలా మంది టమాటాను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇది కూరల రుచి పెంచడానికి, గ్రేవీ చిక్కగా రావడానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలోనే మెజార్టీ జనం మిగతా కూరగాయల కంటే టమాటాలను ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటుంటారు. కానీ, వాటిని సరిగ్గా స్టోర్ చేయకపోవడంతో త్వరగా పాడైపోతుంటాయి. అలాకాకుండా మేము చెప్పే ఈ టిప్స్​ను ఫాలో అయ్యారంటే టమాటాలను(Tomatoes) ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి : టమాటాలు కొనేటప్పుడు పండిన వాటికంటే కచ్చగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే బాగా పండినవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అదేవిధంగా పండని టమాటాలను ఫ్రిజ్​లో కాకుండా ఇంట్లో రూమ్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేయండి. అలా స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని కాండం వైపు కిందకు అభిముఖంగా ఉంచండి. అలాగే వాటికి ఎండ తగలకుండా చూసుకోవడం ద్వారా టమాటాలను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

పండినవి ఇలా స్టోర్ చేసుకోండి!

పచ్చి టమాటాలు ఎక్కువ రోజులు ఉంటాయి కదా అని మొత్తం అవే తీసుకోలేం. కాబట్టి, మీరు కొన్న వాటిల్లో పండిన టమాటాలు ఉంటే అవి మరింత పండ్లు కాకుండా, కుళ్లిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్​లో స్టోర్ చేయండి. ఫలితంగా టమాటాలు త్వరగా పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఉంటాయంటున్నారు. అలాగే వీటిని ఫ్రిజ్​లో నుంచి తీసివ వెంటనే వాడకుండా కొద్దిసేపు రూమ్​ టెంపరేచర్​లో ఉంచి ఆపై వాడుకోవాలి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ టమాటాల రుచిని తగ్గిస్తుందట.

పాలిథిన్ సంచుల్లో భద్రపరచండి : టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే బాక్సులు లేదా కంటైనర్స్​లో, పాలిథిన్ సంచుల్లో, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకునేటప్పుడు వాటి లోపల పేపర్ టవల్స్ ఉంచడం మంచిది. ఎందుకంటే అవి టమాటాలను పొడి ఉంచి తొందరగా కుళ్లిపోకుండా ఉండటానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

పసుపు వాటర్​లో కడగండి : టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. మార్కెట్​ నుంచి తెచ్చాక పసుపు నీటిలో కడగాలి. ఆపై గాలికి ఆరబెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా టమాటాలను త్వరగా కుళ్లిపోకుండా.. ఎక్కువరోజులు తాజాగా నిల్వ చేసుకోవచ్చంటున్నారు.

వీటిలో స్టోర్ చేయకండి : టమాటాలను వీలైనంత వరకు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి తేమను ట్రాప్ చేసి త్వరగా కుళ్లిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి బదులుగా గాలి ఆడే కంటైనర్లు, బుట్టల్లో నిల్వ చేసుకోవడం మంచిదంటున్నారు.

వీటికి దూరంగా ఉంచండి : ఎప్పుడు కూడా టమాటాలను అరటిపండ్లు, యాపిల్, అవకాడోలు వంటి ఇథిలిన్ వాయువు రిలీజ్ చేసే వాటి పక్కన నిల్వ చేయకండి. ఎందుకంటే ఇథిలిన్ అనేది వాటి పక్వాన్ని పెంచుతుంది. ఫలితంగా టమటాలు తొందరగా పండి పాడైపోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

టమాటాలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారు?

మీ డైట్​లో పచ్చి టమాటాలు ఉంటే - రక్తపోటు నుంచి క్యాన్సర్, గుండె జబ్బుల వరకు అన్నీ పరార్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.