ETV Bharat / offbeat

నిగనిగలాడే కూరగాయలు కొంటున్నారా? - FSSAI ఒక్క నిమిషం ఆగమంటోంది! - ADULTERATION IN GREEN VEGETABLES

- కూరగాయల్లో కల్తీ గుర్తించేందుకు ఈ టిప్స్​ ఫాలో అవ్వండి

How to Find Adulteration in Green Vegetables
How to Find Adulteration in Green Vegetables (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 10:57 AM IST

How to Find Adulteration in Green Vegetables: ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన ఆహారమే తినాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్​కు వెళ్తే.. తాజాగా నిగనిగలాడుతున్న ఆకుపచ్చటి కూరగాయలు, తాజాపండ్లను ఎంచుకుంటుంటారు. కూరగాయలు ఎంత పచ్చగా ఉంటే.. అవి అంత తాజావి అనుకుంటారు. కానీ.. ఆ పచ్చటి కూరగాయల్లో.. కల్తీ విషం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూరగాయలు తాజాగా కనిపించేందుకు.. మలాకైట్ గ్రీన్, కాపర్ సల్ఫేట్, రోడమైన్ బి, కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో ఆహారాన్ని విస్తృతంగా కల్తీ చేస్తున్నారని చెబుతున్నారు. మరి, ఆకుపచ్చదనం వెనుక కల్తీ ఉందో? లేదో? తెలుసుకోవడం ఎలా? అంటే.. అందుకు ఫుడ్ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సూచనలు చెబుతోంది. అవి ఇప్పుడు చూద్దాం..

మలాకైట్ గ్రీన్ అంటే ఏమిటి: మలాకైట్ గ్రీన్ ఒక టెక్స్‌టైల్ డై అని.. దీనిని చేపలకు యాంటీప్రొటోజోల్, యాంటీ ఫంగల్ మందుగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది జల జీవులపై ఏర్పడే ఫంగల్ దాడులు, ప్రోటోజోవాన్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. అయితే మిరపకాయలు, బఠానీలు, పాలకూర వంటి కూరగాయలు పచ్చగా కనిపించేలా చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారని చెబుతున్నారు.

ఇది ఎందుకు ప్రమాదకరం: నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ రంగు విషపూరితం. ఇది కార్సినోజెనిసిస్, మ్యూటాజెనిసిస్, క్రోమోజోమల్ ఫ్రాక్చర్, టెరాటోజెనిసిటీ, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుందని వివరిస్తున్నారు.

కల్తీ ఎలా కనిపెట్టాలి:

Identifying Malachite Green in Vegetables
Identifying Malachite Green in Vegetables (FSSAI)

కూరగాయల్లో మలాకైట్​ గ్రీన్​ను గుర్తించడం:

  • ముందుగా ఓ దూది ఉండను తీసుకుని నీరు లేదా వెజిటేబుల్​ ఆయిల్​ ముంచాలి. లిక్విడ్ పారాఫిన్‌లో ముంచిన దూదిని అయిన తీసుకోవచ్చు.
  • ఇప్పుడు ఆ కాటన్​ బాల్​ సాయంతో బెండకాయలను తుడిచి చూడండి..
  • దూది రంగు మారకుంటే అవి తాజావి.. రంగు మారిందంటే అవి మలాకైట్​ గ్రీన్​తో కల్తీ జరిగినట్లు అర్థం. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడం మంచిది.

రెండో పద్ధతి:

  • ముందుగా తడిగా ఉన్న తెల్లటి బ్లోటింగ్ పేపర్​ మీద కొన్ని కూరగాయలు ఉంచాలి.
  • ఒకవేళ ఆ పేపర్​ రంగు మారితే అవి మలాకైట్​ గ్రీన్​తో కల్తీ జరిగినట్లు, ఎటువంటి కలర్​ లేకపోతే అవి తాజావి.​
Detecting Artificial Color in Peas
Detecting Artificial Color in Peas (FSSAI)

బఠానీల్లో ఆర్టిఫిషీయల్​ కలర్​ను గుర్తించడం:

  • ముందుగా ఓ గాజు గ్లాస్​లో కొన్ని బఠానీలు ఉంచాలి.
  • ఇప్పుడు అందులో వాటర్​ యాడ్​ చేసి కలపి.. ఓ అర గంట పాటు పక్కన పెట్టాలి.
  • వాటర్​ రంగు మారితే కల్తీ జరిగినట్లు, కలర్​ మారకుండా అలానే ఉంటే అవి తాజాగా ఉన్నట్లు అర్థం.
Detection of Rhodamine B in Sweet Potato
Detection of Rhodamine B in Sweet Potato (FSSAI)

స్వీట్​ పొటాటోలో రోడమైన్ బి గుర్తించడం:

  • ముందుగా ఓ దూది ఉండను తీసుకుని నీరు లేదా వెజిటేబుల్​ ఆయిల్​ ముంచాలి. లిక్విడ్ పారాఫిన్‌లో ముంచిన దూదిని అయిన తీసుకోవచ్చు
  • ఇప్పుడు ఆ కాటన్​ బాల్​ సాయంతో చిలగడదుంపలను తుడిచి చూడండి..
  • దూది రంగు మారకుంటే అవి తాజావి.. రంగు మారిందంటే అవి రోడమైన్ బి తో కల్తీ జరిగినట్లు అర్థం. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడం మంచిది.

అలర్ట్​: మీరు ఉపయోగించే మసాలాలు స్వచ్ఛమైనవేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా!

మార్కెట్లో కల్తీ గోధుమ పిండి - FSSAI సూచనలు పాటించి పిండి స్వచ్ఛతను ఇలా కనిపెట్టండి!

మార్కెట్​ నెయ్యితో కల్తీ భయమా? - పాల మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.