Girls Life Prediction Based on First Menstruation : ప్రతి అమ్మాయి యుక్త వయసు రాగానే పుష్పవతి అవడం సాధారణం. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆడపిల్ల పుష్పవతి అయిన సమయాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అంటే.. అమ్మాయి మెచ్యూర్(Maturity) అయిన సమయంలో ఉన్న తిథి, వారం, నక్షత్రాన్ని బట్టి వారు జీవితంలో ఎదుర్కొనే ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. అందులో మొదటగా.. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షంలో ఏ తిథి నాడు ఆడపిల్ల మెచ్యూర్ అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
- పాడ్యమి - సంతాన పరమైనటువంటి సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుందట.
- విధియ - అల్పసంతోషం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
- తధియ - అద్భుతమైన సంపదలు పొందుతూ.. సౌభాగ్యవతిగా ఉంటుందట.
- చవితి - సంకుచిత మనస్తత్వం ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
- పంచమి - మంచి సంతానం కలిగి సమస్త సుఖాలను పొందుతుందట.
- షష్టి - కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం పెరుగుతుంది.
- సప్తమి - సంపదలు భాగా లభించడమే కాకుండా ఆభరణాలు ఎక్కువగా ధరించే యోగం ఉంటుంది. జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
- అష్టమి - ధైర్యవంతురాలిగా ఉంటుంది. ఒక్కోసారి ఎవరినీ లెక్కచేయనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటుంట.
- నవమి - జీవితంలో ఒక్కోసారి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.
- దశమి - సుఖసంతోషాలు పొందుతూ జీవితంలో మంచి నాయకురాలిగా ఎదుగుతుంది.
- ఏకాదశి - మంచి బుద్ధిని కలిగి ఉండి.. ఇల్లు, పరిసరాల పట్ల శుభ్రత ఎక్కువగా ఉంటుంది.
- ద్వాదశి - ఇతరుల గురించి అబద్ధాలు చెప్పేటటువంటి లక్షణం వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- త్రయోదశి - ఉల్లాసవంతురాలుగా ఉండడమే కాకుండా సంతోషమైన జీవితాన్ని పొందుతుందట.
- చతుర్ధశి - ఆలోచనలు ఒక్కొక్కసారి చెడుమార్గం వైపు వెళ్తుంటాయి. వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి తిథికి ప్రత్యేకమైన శాంతి చేయించుకోవాలి.
- పౌర్ణమి - చక్కటి శరీర సౌష్టవం కలిగి ఉంటుంది.
- అమవాస్య - సాధారణమైన జీవితాన్ని గడుపుతూ.. కొద్ది సుఖాలు, సౌకర్యాలు కలిగి ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.
అయితే, ఇబ్బందికర తిథుల్లో పుష్పవతి అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకమైనటువంటి అధిష్టాన దేవత ఉంటుంది. తిథికి సంబంధించిన జపం ఉంటుంది. ఆ జపం చేయించుకుంటే చెడు తిథుల్లో పుష్పవతి అయినప్పటికీ ఎలాంటి దోషం ఉండదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
అమ్మాయి ఏ వారం పుష్పవతి అయితే ఎలాంటి ఫలితాలుంటాయంటే?
- ఆదివారం - కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటుంది.
- సోమవారం - సుగుణవంతురాలు అవుతుంది. మంచి గుణగణాలు ఉంటాయి.
- మంగళవారం - జీవితంలో కొన్ని బాధల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందట.
- బుధవారం - ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితం లభిస్తుంది.
- గురువారం - సాంఘీకంగా మర్యాద ఉంటుంది. నిజాయితీ కలిగినటువంటి స్త్రీ మూర్తిగా మారుతుంది.
- శుక్రవారం - వినయవంతురాలిగా ఉంటూ.. ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉంటుందట.
- శనివారం - కుటిలమైనటువంటి మనసు కలిగి ఉంటుంది. ఒక్కోసారి చెంచలమైనటువంటి ఆలోచనలను కలిగింపజేస్తుంది.
అయితే, కొన్ని ప్రత్యేకమైన వారాల్లో పుష్పవతి అయినప్పుడు ఏదైనా దోషం ఏర్పడినప్పటికీ ఆ వారాధిపతి ఏ గ్రహం ఉందో చూసుకుని.. ఆ గ్రహానికి సంబంధించిన శాంతి చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
ఈ నక్షత్రాల్లో మెచ్యూర్ అయితే శుభప్రదం! అదే విధంగా.. కొన్ని నక్షత్రాల టైమ్లో ఆడపిల్ల పుష్పవతి అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నట్లు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అవేంటంటే.. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, ఉత్తర ఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, శ్రవణ, మూల, రేవతి, ధనిష్ట, శతిభిష, అశ్విని, పుష్యమి, రోహిణి, మృగశిర.. ఈ 17 నక్షత్రాలు కూడా శుభప్రదమైనవి. ఈ నక్షత్రాల టైమ్లో అమ్మాయి మెచ్యుర్ అయితే వారికి భవిష్యత్తులో అన్ని రకాలుగా సుఖసౌక్యాలు లభిస్తాయంటున్నారు. అలాకాకుండా.. మిగిలిన నక్షత్రాల్లో పుష్పవతి అయితే మాత్రం ఆ నక్షత్రాధిపతికి సంబంధించిన జపం చేయించుకుంటే ఆ దోషాన్ని తొలగించుకోవచ్చంటున్నారు జ్యోతిష్యలు మాచిరాజు కిరణ్ కుమార్.
చివరగా.. చెడు తిథి, వారం, నక్షత్రాలలో అమ్మాయి పుష్పవతి అయితే వాటి అధిపతికి జపాలు చేయించుకుంటే ఎలాంటి చెడు ఫలితం ఉండదంటున్నారు. ఆ శాంతితో సంపూర్ణంగా అనుకూలమైన జాతకాన్ని అందిపుచ్చుకోవచ్చంటున్నారు. అదేవిధంగా అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
అలర్ట్ : పిజ్జా, చిప్స్ తింటే చిన్నవయసులోనే "పెద్ద మనిషి" అయిపోతారు! - షాకింగ్ రీసెర్చ్!
అలర్ట్ : అమ్మాయిలూ.. మీరు చాలా మంచివారా? - అయితే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి!