ETV Bharat / offbeat

3 నిమిషాలు పరీక్షిస్తే చాలు - మీరు ఎంత కాలం జీవిస్తారో తెలుసుకోవచ్చట! - రీసెర్చ్​లో ఆశ్చర్యకరమైన విషయాలు! - Predict Lifespan - PREDICT LIFESPAN

Test To Predict Lifespan : ఒకప్పుడు మనిషి ఆయుర్దాయం వందేళ్లు ఉండేది. కానీ.. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారిన జీవిన విధానం వంటి కారణాలతో.. ప్రస్తుతకాలంలో అది 60-70కి పడిపోయింది. అయితే, ఒక చిన్న టెస్ట్​ చేయడం ద్వారా మనిషి ఎంతకాలం జీవిస్తారో తెలుసుకోవచ్చట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Predict Lifespan
Test To Predict Lifespan (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 6, 2024, 2:38 PM IST

Fitness Test To Predict Lifespan : నేటి ఆధునిక యుగంలో చాలా మంది జనాలు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తున్నారు కానీ, వ్యాయామం మాత్రం చేయడం లేదు. దీనివల్ల చిన్నవయసులోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్​, కిడ్నీ ఫెయిల్యూర్​ వంటి దీర్ఘకాలిక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. చాలా మంది నూరేళ్లూ నిండకుండానే తనువు చాలిస్తున్నారు.

ఇలా ఎక్కువ కాలం జీవించకపోవడానికి బాడీ ఫ్లెక్సిబుల్​గా లేకపోవడం ఓ కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను పరిశోధకులు గుర్తించారు. అసలు ఎక్కువ కాలం జీవించడానికి.. బాడీ ఫ్లెక్సిబుల్​గా ఉండడానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత కాలంలో ఉన్నంతగా రవాణా సదుపాయాలు ఒకప్పుడు లేవు. ఎంత దూరమైనా నడిచే వెళ్లేవారు. దీంతో వారు అధిక బరువు లేకుండా చురుకుగా ఉండేవారు. కానీ, ప్రస్తుత కాలంలో నడక తగ్గిపోయింది. దీనివల్ల మన శరీరానికి వ్యాయామం లేకపోవడంతో బాడీ ఫ్లెక్సిబిలిటీ కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా శరీరం ఫ్లెక్సిబిలిటీ కోల్పోవడం ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని బ్రెజిల్​కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన 'స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్​ సైన్స్‌' ప్రచురించింది. ఈ రీసెర్చ్​లో ఆరోగ్యంగా ఉన్న 3,100 మందికి మూడు నిమిషాల పాటు 'ఫ్లెక్సిండర్' అనే టెస్ట్​ నిర్వహించారు. ఆ టెస్ట్​ ఏంటంటే.. చీలమండ, మోకాలు, తుంటి, మొండెం, మణికట్టు, మోచేయి, భుజం కదిలించేలా 20 రకాల ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు చేయడం.

పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారట!

ఫ్లెక్సిండర్ పరీక్షలో సరిగా వ్యాయామాలు చేయలేకపోయిన వారి జీవితకాలం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. పురుషుల కంటే మహిళలు 35 శాతం ఎక్కువ ఫ్లెక్సిబుల్‌గా ఉన్నట్టు కనుగొన్నారు. దాని ప్రకారం.. పురుషులకంటే మహిళలే ఎక్కువ కాలంపాటు జీవించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ పరిశోధనలో స్పోర్ట్స్​ మెడిసిన్ ఫిజిషియన్ 'డాక్టర్​ క్లాడియో గిల్ డి. అరౌజో' (Dr Caludio Gil D. Araújo) పాల్గొన్నారు. గతంలో శరీరకంగా ఫిట్​గా ఉండడం వల్ల మనిషి ఎక్కువ కాలం జీవించేవారు. కానీ శరీరానికి ఎక్సర్​సైజ్​లు లేకపోవడంతో ఫ్లెక్సిబిలిటీ కోల్పోతోందని, దీనివల్ల మనిషి జీవితకాలం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

బాడీ ఫ్లెక్సిబుల్​గా ఉండాలంటే ఇలా చేయాలి..

  • రోజూ తప్పకుండా కనీసం అరగంటైనా శారీరక శ్రమ కలిగేలా నడక, పరుగు, సైక్లింగ్​ వంటి వ్యాయామాలు చేయాలి.
  • అలాగే అధిక బరువుతో బాధపడేవారు మంచి డైట్​ పాటించి, వివిధ రకాల వ్యాయామాలు చేసి వెయిట్​ లాస్​ కావాలి.
  • బాడీ ఫ్లెక్సిబుల్​గా ఉండడానికి తోడ్పడే వ్యాయామాలు చేయాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

మీ బాణపొట్టకు కారణం తిండి కాదు- మీరు చేసే ఈ చిన్న తప్పులేనట! - షాకింగ్ రీసెర్చ్!

రీసెర్చ్​: గంటలపాటు నడవాల్సిన అవసరం లేదు - ఇన్ని నిమిషాలు వాకింగ్​ చేస్తే చాలు - ఫుల్​ హెల్త్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.