Easy Kitchen Tools : చాలా మంది మహిళలు కిచెన్‌లోని పరికరాలు స్మార్ట్‌గా ఉండాలనుకుంటారు. చూడడానికి చిన్నగా ఉండడంతో పాటు.. సులభంగా ఉపయోగించే విధంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, వినియోగదారులను ఆకట్టుకునేందుకు మార్కెట్లో చాలా రకాల కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కిచెన్‌లో మహిళలకు ఉపయోగపడే పలు పరికరాలను ఇప్పుడు చూద్దాం.
3ఇన్1 కిచెన్ టూల్.. సాధారణంగా కూరలు చేసేటప్పుడు.. కూరగాయలు కట్ చేయడం కోసం, పీల్ చేయడం కోసం ఒక్కో పనికి ఒక్కో పరికరం అవసరమవుతూ ఉంటుంది. అలాకాకుండా ఒకే పరికరంతో అనేక ప్రయోజనాలుంటే బాగుంటుంది కదా! అందుకోసం వచ్చిందే ఈ 3ఇన్1 కిచెన్ టూల్ (3 in 1 kitchen tool). ఇది పీలర్, గ్రేటర్, నైఫ్ షార్ప్‌నర్‌గా ఉపయోగపడుతుంది.
ఈ పరికరానికి ఓవైపు పీలర్ మోడ్, మరోవైపు షార్ప్‌నర్ మోడ్‌లు ఉన్నాయి. పీలర్ మోడ్‌లో కూరగాయలు తొక్క తీసేయడానికీ, గ్రేట్ చేసుకోవడానికి అవసరమైన బ్లేడులు ఏర్పాటు చేశారు. షార్ప్‌నర్ మోడ్‌తో ఇంట్లో ఉన్న రకరకాల కత్తులను పదును పెట్టుకోవచ్చు. ఇందులో టంగ్‌స్టన్ స్టీల్, సెరామిక్ మెటీరియళ్లను ఉపయోగించి చేసిన బ్లేడ్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది కాబట్టి, దీన్ని పిక్‌నిక్‌లూ, టూర్‌లకు వెళ్లేటప్పుడు మనతోపాటు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
తడిగా లేకుండా.. కిచెన్‌లో పాత్రలు తోమిన తర్వాత వాటిని ఓ స్టాండ్‌లో వేసేస్తాం. కానీ, వాటినుంచి కారే వాటర్ కిచెన్ గట్టుపై పడి తడితడిగా మారిపోతుంటుంది. అలానే టీ/కాఫీ, పాలు లాంటివి కలిపేటప్పుడు కూడా గట్టుపై వాటి మరకలు పడుతుంటాయి. ఆ ఇబ్బందిలేకుండా 'డిష్ డ్రయ్యింగ్ మ్యాట్' (Dish drying mat) చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కిచెన్‌గట్టు, షెల్ఫ్స్, డైనింగ్‌టేబుల్.. వంటి వాటిపై పరచుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకోవడము తేలికే. అవసరం లేదనుకున్నప్పుడు మడిచేసి వంటింట్లో డ్రాలో సర్దేసుకుంటే సరిపోతుంది.
గుజ్జు తీయడానికి.. పిల్లల కోసం అప్పటికప్పుడూ పండ్లరసాలు చేయడానికి ఈ 'ఫ్రూట్ స్లైసర్' (Fruit slicer) ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అచ్చం పండ్ల గుజ్జు కూడా పిల్లలకు పెట్టవచ్చు. దీంతో పండ్లను ముక్కలుగా కట్ చేయొచ్చు. పండుపై తోలునీ, దాన్లోని గుజ్జునూ వేరుచేసుకునేందుకు అనువుగా మరో వంపులాంటి స్టీల్ బ్లేడు ఉంటాయి. ఒకేదాన్లో రెండూ ఉండడంతో స్పీడ్‌గా రసాలు తయారుచేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
ఉల్లిపాయల కటింగ్, ఉడికించినవి వడకట్టడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఈ టూల్స్ ఉంటే ఆ పని చాలా ఈజీ!
చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా?