ETV Bharat / offbeat

స్వీట్ షాప్ స్టైల్ "దాల్మోత్ మిక్చర్" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి! - 2 నెలలు ఫ్రెష్​గా!

సూపర్ సింపుల్ అద్దిరిపోయే స్నాక్ రెసిపీ - ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే దాదాపు 2 నెలల వరకు తినొచ్చు!

HOW TO MAKE DALMOTH MIXTURE
Dalmoth Mixture (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 5:16 PM IST

Dalmoth Mixture Recipe in Telugu : ఎక్కువ మంది ఇష్టపడే స్నాక్ రెసిపీలలో ఒకటి మిక్చర్. అందులో భాగంగానే చాలా మంది స్వీట్ షాప్స్​కి వెళ్లినప్పుడు దాల్మోత్ మిక్చర్​ని టేస్ట్ చేస్తుంటారు. పిల్లలైతే ఈ మిక్చర్​ని ఇంకా ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇంటికి పార్సిల్ తెస్తుంటారు. అలాకాకుండా మీరే చాలా ఈజీగా ఇంట్లోనే ఈ దాల్మోత్​ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా స్వీట్​ షాపుల్లో లభించే దానికి ఏమాత్రం తీసిపోదు! మరి, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఎర్ర కందిపప్పు - 500 గ్రాములు
  • వంటసోడా - 1 టీస్పూన్
  • జీడిపప్పు పలుకులు - ముప్పావు కప్పు
  • కరివేపాకు - పావు కప్పు
  • కారం - రుచికి తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బ్లాక్ సాల్ట్ - అరటీస్పూన్
  • చాట్ మసాలా - 1 టీస్పూన్
  • ఆమ్​చూర్ పౌడర్ - అరటీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్

కారపూస కోసం :

  • శనగపిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా పొట్టుతో ఉండే ఎర్ర కందిపప్పును(మసూర్ దాల్) తీసుకొని రెండు మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆపై అందులో తగినన్ని వాటర్ పోసి వంటసోడా వేసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి.
  • నెక్ట్​ డే రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మరోసారి నానబెట్టుకున్న పప్పును శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఆపై ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్​ను ఉంచి దాని మీద పప్పును పల్చగా పరచి ఎలాంటి చెమ్మ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఆపై పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన కారపూసను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, పసుపు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక అరటీస్పూన్ ఆయిల్ వేసి మరోసారి పిండిని మిక్స్ చేసుకోవాలి. ఆపై 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండిలో నూనె వేయడం వల్ల కారపూస గుల్లగా వస్తుంది.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మురుకుల గొట్టం తీసుకొని అందులో కారపూస చేసుకునే బిళ్లను సెట్ చేసుకోవాలి.
  • ఆయిల్ బాగా వేడయ్యాక.. స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కాగుతున్న నూనెలో జాగ్రత్తగా మురుకుల గొట్టంతో పిండిని కారపూసలా వత్తుకోవాలి. ఆపై కారపూస క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఫ్లేట్​లో తీసుకోవాలి. తర్వాత అది పూర్తిగా చల్లారాక చేతితో సన్నగా బ్రేక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కారపూస వేయించుకున్న ఆయిల్​లోనే స్టెయినర్(జాలీ గంటె) పెట్టుకొని నానబెట్టి ఆరబెట్టుకున్న పప్పును కొద్దిగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి.
  • తర్వాత దాన్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్​లోకి తీసుకోవాలి. అలా పప్పు మొత్తాన్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే ఆయిల్​లో స్టెయినర్ సహాయంతో జీడిపప్పు పలుకులను కూడా లో ఫ్లేమ్​ మీద గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకును వేయించుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో వేయించుకున్న పప్పు, కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఆమ్​చూర్ పౌడర్, జీలకర్ర పొడి వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో ఫ్రై చేసుకున్న కరివేపాకు, జీడిపప్పుతో పాటు ముందుగా తయారు చేసుకున్న కారపూస వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ "దాల్మోత్ మిక్చర్" రెడీ!
  • ఆపై ఈ మిక్చర్​ను గాలి చొరబడని కంటైనర్​లో స్టోర్ చేసుకుంటే దాదాపు 2 నెలల పాటు ఫ్రెష్​గా తినేయొచ్చు!

ఇవీ చదవండి :

ఈవెనింగ్​ టైమ్​ బెస్ట్​​ స్నాక్ "ఎగ్​ 65" - ఎటువంటి సాస్​లు అవసరం లేదు - టేస్ట్​ సూపర్​!

కరకరలాడే మహారాష్ట్ర స్పెషల్ "కొత్తిమీర వడలు" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.