ETV Bharat / offbeat

డైలీ ​కూరలు తిని విసుగొచ్చిందా - ఇలా "దోసకాయ పచ్చడి"ని ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్భుతం! - DOSAKAYA PACHADI

దోసకాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే - అన్నం మొత్తం దాంతోనే లాగించేస్తారు!

How to Make Dosakaya Pachadi
Dosakaya Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 3:31 PM IST

How to Make Dosakaya Pachadi : పచ్చడి అనగానే మనందరికీ ముందుగా ఆవకాయ, టమాటా, ఉసిరికాయ వంటి నిల్వ పచ్చళ్లే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. అయితే, అవి మాత్రమే కాదు దోసకాయతో కూడా అద్దిరిపోయే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి దోసకాయ పచ్చడిని ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుంటారు. వేడి వేడి అన్నంలో ఈ చట్నీలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతమని చెప్పవచ్చు! మరి, ఆలస్యమెందుకు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - 1 టేబుల్​స్పూన్
  • తెల్ల నువ్వులు - అరటీస్పూన్
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
  • టమాటాలు - 2(మీడియం సైజ్​వి)
  • చింతపండు - చిన్న నిమ్మకాయంత
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • దోసకాయ - 1(మీడియం సైజ్​ది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1(చిన్న సైజ్​ది)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మినపప్పు - కొద్దిగా
  • శనగపప్పు - కొద్దిగా
  • ఎండుమిర్చి - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - 1 రెమ్మ

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా దోసకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే, పచ్చిమిర్చి, టమాటాలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగాక నువ్వులు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకున్నాక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి మూత పెట్టుకొని మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్​గా మారేంత వరకు మగ్గించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని పాన్​ని దించి మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమం వేసుకొని మెత్తని పౌడర్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులో పూర్తిగా చల్లార్చుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమం వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమంలో సగం వరకు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో మిగిలిన దోసకాయ ముక్కలు, సన్నని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుతో పాటు ఎండుమిర్చిని తుంపి వేసుకొని పోపును చక్కగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపుని వేసి మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "దోసకాయ పచ్చడి" రెడీ!

ఇవీ చదవండి :

ఎప్పుడూ రొటీన్ పచ్చళ్లే కాదు - ఓసారి "అరటిపువ్వు చట్నీ" ట్రై చేయండి! - టేస్ట్ వేరే లెవల్ అంతే!

నోరూరించే "ఉసిరికాయ తురుము నిల్వ పచ్చడి" - ఇలా పెడితే ఏడాది నిల్వ ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.