Cooking Tips for Frozen Vegetables: ఫ్రెష్‌గా దొరికే కూరగాయల్ని అప్పటికప్పుడే కట్ చేసుకొని వండుకుంటాం కాబట్టి.. అందులోని పోషకాలన్నీ శరీరానికి లభిస్తాయి. అదే.. ఫ్రోజెన్ వెజిటబుల్స్‌తో ఈ ప్రయోజనం ఉండదేమో అనుకుంటారు చాలా మంది. కానీ.. శీతలీకరణ పద్ధతిలో తయారు చేసే ఫ్రోజెన్ వెజిటబుల్స్‌లో కొన్నింటి పోషక విలువల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఫ్రోజెన్ వెజిటబుల్స్ కొన్నా వాటిలోని పోషకాలన్ని అందడంతో పాటు వంటలు రుచిగా ఉండాలంటే.. వాటిని ఎంచుకునే విషయంలో, వండుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- ఏదేమైనా ఫ్రోజెన్ వెజిటబుల్స్ ఎంచుకునే ముందు మాత్రం ఆ ప్యాకెట్ లేబుల్‌ని క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. శీతలీకరించిన కాయగూరల్లో చాలావరకు ప్రిజర్వేటివ్స్ ఉండవట! అత్యంత అరుదుగా మాత్రమే చక్కెర/ఉప్పు(Salt)/సాస్‌లు/ఇతర ఫ్లేవర్లుండే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
- అందుకే.. వీటిని తీసుకునేముందు లేబుల్‌ని చదివి ప్రిజర్వేటివ్స్ లేనివి తీసుకోవడం మంచిదంటున్నారు. అంతేకాదు.. ఇవి నెలల తరబడి నిల్వ ఉంటాయి, ఏడాది పొడవునా దొరుకుతాయి కాబట్టి.. ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
వండుకునే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు!
- సాధారణ కాయగూరల్లా కాకుండా.. ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ని వండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. తద్వారా టేస్ట్ తగ్గకుండా, పోషకాలు కోల్పోకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
- ఆయా రకాల ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ని ఎలా వండుకోవాలి? వాటిని ఎంత టైమ్ ఉడికించాలి? అనే వివరాలు ఆ ప్యాకెట్ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.
- అంతేకాదు.. ముందుగా వీటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా? లేదంటే.. అలాగే వండుకోవాలా అనే విషయాన్నీ లేబుల్‌పై ఓసారి చెక్ చేసుకోవాలి. లేదంటే ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుందట!
- చాలా మంది ఫ్రోజెన్ వెజిటబుల్స్(Vegetables) గడ్డకట్టినట్లుగా ఉంటాయి కాబట్టి.. ఎక్కువ సమయం ఉండికించాలనుకుంటారు. కానీ.. ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిని ముందు వేడి వాటర్‌లో కాసేపు ఉంచి.. ఆ తర్వాత శీతలీకరిస్తారట! ఫలితంగా.. అవి కాస్త ఉడికిపోయి ఉంటాయి. కాబట్టి.. ప్యాకేజ్‌పై పేర్కొన్న నిర్ణీత సూచనల మేరకు వీటిని వాడితే బెటర్ అంటున్నారు.
- ఒకవేళ ఎక్కువసేపు ఉడికించినా.. అవి టేస్టే కోల్పోయి, పోషకాలు తరిగిపోయే ఛాన్స్ ఉంటుందట! అందుకే.. కావాలనుకుంటే ఫోర్క్ సహాయంతో అవి ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
- ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ని ప్రధానంగా రోస్టింగ్, స్టీమింగ్, సాటింగ్ (తక్కువ నూనెతో వంట చేయడం).. వంటి పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకునే వంటకాల్లో ఉపయోగించడం లేదంటే వాటినే ఆయా పద్ధతుల్లో వండుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుందని చెబుతున్నారు.
- ఇకపోతే.. వండుకోగా మిగిలిపోయిన ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఓ పద్ధతి ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. వాటిని అలాగే ఫ్రిజ్‌లో స్టోర్ చేయకుండా.. ముందు రూమ్ టెంపరేచర్ వద్దకు తీసుకొచ్చి.. ఆపై గాలి చొరబడని బ్యాగ్ లేదా డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవాలి. అప్పుడే.. అవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. వాటిలోని పోషకాలూ తరిగిపోవని సూచిస్తున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఆ కూరగాయలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే!
ఈ పదార్థాలు పచ్చిగా తినడం కంటే - ఉడికించి తింటే 'డబుల్' బెనిఫిట్స్!