ETV Bharat / offbeat

ఆకుకూరల్ని ఇలా.. మాంసం అలా వండాలి - లేదంటే పోషకాలన్నీ ఎగిరిపోతాయ్! - COOKING TIPS

- కుకింగ్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

Cooking Tips
Cooking Tips Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 2:06 PM IST

Cooking Tips Telugu : మనం పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ హెల్దీ ఫుడ్​ తీసుకోవాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ ఆరోగ్యం కోసం మహిళలు వంటింట్లో ఎంతో శ్రమిస్తుంటారు. అయితే.. తెలిసో తెలియకో వంట చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో కూరగాయలు, మాంసం, ఆకుకూరల్లోని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంటుందట!. అందుకే వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో మీరు చూసేయండి..

మరీ చిన్నగా వద్దు!

కొందరు బంగాళాదుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికిస్తుంటారు. కానీ, అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయట. అందుకే పొటాటోలని బాగా కడిగి మధ్యలో చిన్నగా కోసి పొట్టుతో పాటు ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు ఎక్కడికీ పోదు. ఇతర పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

క్యాబేజీ ఇలా వండండి..

ఎక్కువ మంది క్యాబేజీని ఉడికించి కూర చేస్తారు. ఇలా ఉడికించినప్పుడు అందులో మన బాడీకి మేలు చేసే గుణాలన్నీ వృథాగా పోతాయి. అందుకే.. దీన్ని ఉడికించేటప్పుడు వాటర్లో ఆయిల్​ లేదా కాస్త వెన్న వేయాలి. అప్పుడు పోషకాలు తొలగిపోవు. అలాగే క్యాబేజీని ఎక్కువగా ఉడికించినా, వేయించినా సల్ఫర్‌ విడుదలై దాని టేస్ట్​ మారే ప్రమాదముంటుంది.

మాంసం-చేపలు..

మాంసం-చేపలను ఎక్కువ మంట మీద ఉడికిస్తే.. అందులో ఉండే మాంసకృత్తులు నశించిపోతాయి. ఇంకా ఆరోగ్యానికి హాని చేసే కార్సినోజెనిక్ కాంపౌండ్లు, హెటరో సైక్లిక్ అమైన్స్‌ విడుదలవుతాయి. కాబట్టి, తక్కువ మంట మీద ఉడికించాలి.

ఆకుపచ్చటి కాయగూరలు ఇలా..

గోంగూర, పాలకూర, బచ్చలి కూర, తోటకూర, కొత్తిమీర, మెంతి.. వంటి ఆకుకూరలతో పాటు బ్రకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ మొదలైనవన్నీ ఆకుపచ్చటి కాయగూరల కిందకే వస్తాయి. వీటిని వండుకునేటప్పుడు టీస్పూన్‌ ఆయిల్​/వెన్న/నెయ్యి.. ఉపయోగిస్తే.. అందులోని పోషకాలు తరిగిపోకుండా ఉంటాయి. పైగా దీనివల్ల ఈ పోషకాలన్నీ మన శరీరం త్వరగా గ్రహిస్తుందట.

మరిగించిన నీరు వృథా కాదు..

ఆకుపచ్చటి కాయగూరల్ని వండే ముందు కాసేపు వేడి నీళ్లలో ఉంచితే.. కర్రీ వండే క్రమంలో అవి త్వరగా ఉడుకుతాయి. అలాగే వంట కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంకా ఆకుకూరలు మరిగించిన నీటిని అదే కూరలో వాడడం వల్ల వాటిలోని పోషకాలు బయటికి పోకుండా, కూర రుచి పెరుగుతుంది. ఇక్కడ వాటర్​కు బదులుగా వెనిగర్‌, నిమ్మరసం మిశ్రమంలో కూడా వీటిని వేసి ఉంచచ్చు. దీంతో కూర మరింత రుచిగా, చిక్కగా వస్తుంది.

మరి కొన్ని చిట్కాలు..

  • అలాగే స్టీమింగ్‌ పద్ధతిలో కూడా ఈ కాయగూరల్ని కుక్​ చేయచ్చు. వాటిలోని పోషకాలు తరిగిపోకుండా ఉండేందుకు ఇది కూడా ఓ మంచి పద్ధతి.
  • ఆకుపచ్చటి కాయగూరల్ని వండేటప్పుడు ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్‌ ఆయిల్​, వెనిగర్‌, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, కారం.. వంటివి ఉపయోగిస్తే ఆ కూర టేస్ట్​ ఇనుమడిస్తుంది. అలాగే ఆయా పదార్థాల్లోని పోషకాలు కూడా బాడీకి అందుతాయి.
  • కొందరికి కూర గ్రేవీగా/జారుడుగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే వాటర్​ పోయకుండా డ్రైగా ఫ్రై చేస్తుంటారు. ఆకుపచ్చటి కాయగూరల్ని ఇలా వండడం వల్ల వాటిలోని పోషకాలు తరిగిపోవడంతోపాటు కలర్​ కూడా మారిపోతాయి.
  • కాబట్టి వీటిని వండే క్రమంలో కొద్దిగా వాటర్​ పోసుకోవడం మంచిది. ఫలితంగా కూర రుచి మరింత పెరుగుతుంది.
  • ఆకుపచ్చటి కాయగూరల్ని చిన్నగా తరగడం కంటే పెద్ద పెద్ద ముక్కల్ని కర్రీ కోసం ఉపయోగిస్తే.. వాటిలోని పోషకాలు నశించిపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాకాకుండా చిన్నగా కట్​ చేస్తే పోషక విలువలు త్వరగా కోల్పోతాయట!
  • ఏ పదార్థాన్నైనా పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే అందులోని పోషకాలు కూడా నశిస్తాయి. ఇది గ్రీన్‌ వెజిటబుల్స్‌కి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఒక్కసారి కర్రీ వండాక మళ్లీ వేడి చేయకపోవడం మేలు.
  • సలాడ్లు, బర్గర్లు, శాండ్‌విచ్‌ వంటి వాటిల్లో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటాం. నిజానికి ఇది ఒక మంచి పద్ధతి. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్‌ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియ రేటును పెంచుతుంది. కాబట్టి వాటిని వేయించకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

పల్లీలు ఒలిచేందుకు ఈ బాక్సు.. ఎగ్స్​ కోసం ఆ బాక్సు! - సరికొత్త కిచెన్​ టూల్స్​ చూశారా?

చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.