ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "రెస్టారెంట్ స్టైల్ చికెన్ థాలీ" - చాలా తక్కువ టైమ్​లో ప్రిపేర్ చేసుకోండిలా! - ఆదివారం అద్దిరిపోతుంది! - Chicken Thali Recipe - CHICKEN THALI RECIPE

Chicken Thali Recipe: చికెన్ అంటే ఎంత ఇష్టమైనా సరే.. ఒకటే తరహాలో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే.. మీకోసం ఈ సండే అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే.. సూపర్ టేస్టీగా ఉండే "చికెన్ థాలీ". చాలా తక్కువ టైమ్​లో రెస్టారెంట్​కి మించిని రుచితో ఈ థాలీని ప్రిపేర్ చేసుకోవచ్చు! ఇంతకీ.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Chicken Thali
Chicken Thali Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 22, 2024, 12:27 PM IST

How to Make Chicken Thali Recipe in Telugu: ప్రతి సండే ఒకటే తరహాలో చికెన్ తిని బోర్ కొట్టిందా? అయితే, మీకోసం ఈ సండే ఇంటిల్లిపాది ఆస్వాదించేలా అద్దిరిపోయే "చికెన్ థాలీ" రెసిపీ తీసుకొచ్చాం. కోకోనట్ పులావ్, స్పైసీ చికెన్ మసాలా కర్రీ, ఫ్రూట్ రవ్వ కేసరీ, పచ్చి పులుసు, వైట్ రైస్, ఆమ్లెట్, సలాడ్, మజ్జిగ వంటి వాటితో సండే స్పెషల్ చికెన్ థాలీ అద్దిరిపోతుంది. టేస్ట్​లో రెస్టారెంట్​కి మించిన అనుభూతి కలుగుతుంది! మరి, ఇంకెందుకు ఆల్యసం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

కోకోనట్ పులావ్ కోసం :

  • బాస్మతి రైస్ - 2 కప్పులు
  • పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • కొబ్బరినూనె - 1 టేబుల్ స్పూన్
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • బిర్యానీ ఆకులు - 2
  • లవంగాలు - 15
  • జీలకర్ర - అర టీస్పూన్
  • సోంపు - అర టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1(నిలువుగా కట్​ చేసుకోవాలి)
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • జీడిపప్పు - 15
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు :

మసాలా పేస్ట్​ కోసం:

  • లవంగాలు - 8
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మిరియాలు - అర టీస్పూన్
  • యాలకులు - 4
  • మరాటి మొగ్గ - 1
  • దాల్చిన చెక్క - 1
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకులు - 2
  • ఎండుమిర్చి - 15
  • ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • గసగసాలు - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - చిటికెడు

చికెన్ కర్రీ కోసం :

  • చికెన్ - అరకిలో
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • నూనె - తగినంత
  • ఉల్లిపాయ - 1(సన్నగా తరుక్కోవాలి)
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • టమాటాలు - 3( సన్నగా కట్ చేసుకోవాలి)

ఫ్రూట్​ రవ్వ కేసరీ కోసం :

  • నెయ్యి - పావు కప్పు
  • జీడిపప్పు - 15
  • బాదం - 10
  • యాలకులు - 4
  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • శనగ పిండి - అర కప్పు
  • వాటర్ - కప్పు
  • పాలు - ఒకటిన్నర కప్పు
  • ఫైనాఫిల్ ఎసెన్స్ - 4 డ్రాప్స్
  • పంచదార - 1 కప్పు
  • యెల్లో ఫుడ్ కలర్ - 1 టేబుల్ స్పూన్
  • గ్రీన్ & రెడ్ టూటి ఫ్రూటీ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

పచ్చి పులుసు కోసం :

  • ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • కారం - ముప్పావు టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)
  • బెల్లం - చిన్న ఉసిరికాయంత సైజ్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • చింతపండు - 50 గ్రాములు

తయారీ విధానం :

  • సండే స్పెషల్ చికెన్ థాలీ కోసం ముందుగా బాస్మతి రైస్​ను శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
  • బియ్యం నానేలోపు చికెన్ కర్రీలోకి కావాల్సిన మసాలా పేస్ట్​ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని గసగసాలు, పెరుగు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగతా పదార్థాలను ముందుగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో గసగసాలు వేసి చిట్లే వరకు వేయించుకొని మిక్సీ జార్​లో తీసుకోవాలి. ఆపై మిగతా వాటితో పాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్​ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆపై దానిలో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, నూనె, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి చికెన్​ను పిండుతూ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక అరగంట పాటు అలా వదిలేయాలి.
  • ఆలోపు మీరు థాలీలోకి కావాల్సిన ఫ్రూట్​ రవ్వ కేసరీ ప్రిపేర్ చేసుకోండి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, సగానికి కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకొని కాస్త ఎర్రగా మారే వరకు వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో యాలకులను చీల్చి వేసుకున్నాక బొంబాయి రవ్వ, శనగపిండినీ వేసుకొని ఆ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ మంట మీద 7 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ మిశ్రమం బాగా వేగిందనుకున్నాక.. అందులో వాటర్, పాలు యాడ్ చేసుకొని బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • రవ్వ ఉడికాక అందులో ఫైనాఫిల్ ఎసెన్స్, పంచదార, నీళ్లలో కరిగించి యెల్లో ఫుడ్ కలర్ వేసి మిశ్రమాన్ని కలుపుతూ చక్కెరను కరగనివ్వాలి.
  • పంచదార పూర్తిగా కరిగిపోయాక.. గ్రీన్ & రెడ్ టూటి ఫ్రూటీ, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు, నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి దించుకుంటే చాలు. థాలీలోకి కావాల్సిన ఫ్రూట్​ రవ్వ కేసరీ రెడీ!
  • ఇప్పుడు వైట్ రైస్​లోకి పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. చింతపండు కాకుండా పచ్చిపులుసు కోసం చెప్పుకున్న మిగతా పదార్థాలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అన్నీ కలిసేలా బాగా పిండాలి.
  • ఆ తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసి బాగా కలుపుకున్నాక ఉప్పు, కారం రుచి చూసి తాలింపు పెట్టుకుంటే చాలు. చింతపులుసు రెడీ!

సండే స్పెషల్​ - టేస్టీ "రాజుగారి కోడి పులావ్​" - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

  • ఈలోపు చికెన్ మంచిగా నానిపోతుంది. కాబట్టి ఇప్పుడు.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి అవి సాఫ్ట్​గా మారే వరకు ఉడికించుకోవాలి. ఆపై ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ఉడికాక అందులో అరలీటర్ వాటర్ పోసి మూతపెట్టి సుమారు 25 నిమిషాల పాటు మిశ్రమాన్ని ఉడికించుకొని దింపే ముందు కాస్త నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటే చాలు. సూపర్ టేస్టీగా ఉండే.. మసాలా చికెన్ కర్రీ రెడీ!
  • ఇప్పుడు.. కోకోనట్ పులావ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్​లో కొబ్బరి ముక్కలు కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాక గట్టిగా పిండి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై కుక్కర్ పెట్టుకొని కొబ్బరినూనె, ఆయిల్ వేసుకున్నాక లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఆపై అందులో జీలకర్ర, సోంపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అనంతరం జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి.
  • ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, ముందుగా తీసుకున్న కప్పు కొబ్బరి పాలు, కప్పు నీళ్లతో పాటు మరో కప్పు సెకండ్ ఎక్స్​ట్రాక్ట్ కొబ్బరి పాలు పోసి బాగా కలుపుకోవాలి. సెకండ్​ ఎక్స్​ట్రాక్ట్​ కొబ్బరి పాలు అంటే ఫస్ట్​ కొబ్బరిపాలు తీసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరిలో మరో కప్పు నీళ్లు పోసి గ్రైండ్​ చేసుకుని గట్టిగా పిండి పాలు తీసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమం ఒక పొంగు వచ్చాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆపై కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బాస్మతి రైస్​కైతే కప్పు రైస్​కి కప్పున్నర నీళ్ల కొలత తీసుకోవాలి. అదే.. నార్మల్ రైస్ తీసుకుంటే కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. కాకపోతే.. 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, ఒక విజిల్ మీడియ ఫ్లేమ్​ మీద వచ్చేలా చూసుకోవాలి. అంతే.. టేస్టీ కోకోనట్ పులావ్ రెడీ!
  • తర్వాత తాలీలోకి కావాల్సిన ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే.. సలాడ్ రెడీ చెసుకోవాలి.
  • ఇక చివరగా.. ఒక సర్వింగ్ ప్లేట్​లో కొద్దిగా పులావ్, ఒక కప్పులో చికెన్ కర్రీ, మరో దాంట్లో ఫ్రూట్​ రవ్వ కేసరీ, ఇంకో బౌల్​లో చింతపులుసు, ఆమ్లెట్, సలాడ్, ఒక గ్లాసులో మజ్జిగ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. వీకెండ్ స్పెషల్ అద్దిరిపోయే.. "చికెన్ థాలీ" మీ ముందు ఉంటుంది!

సండే స్పెషల్ - తెలంగాణ స్టైల్​లో "చికెన్ ఫ్రై" ఇలా చేయండి - రుచి అద్దిరిపోతుంది!

ప్రెషర్​ కుక్కర్​లో చికెన్​ బిర్యానీ - పిల్లలు కూడా ఈజీగా వండేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.