ETV Bharat / offbeat

హెల్దీగా ఉండాలంటే ఆహారమే కాదు- డైలీ ఈ గింజలు కూడా తినాలి! - What Seeds Good for Health - WHAT SEEDS GOOD FOR HEALTH

Best Seeds for Health : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వేళకు సరైన పోషకాహారం తీసుకోవడం లేదు. దీనివల్ల చిన్నవయసులోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంతో పాటు కొన్ని రకాల గింజల్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. ?

What Seeds Good for Health
Best Seeds for Health (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 3, 2024, 11:28 AM IST

What Seeds that are Beneficial to Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు కొన్ని రకాల గింజలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఆరోగ్యంగా ఉండడానికి ఏ గింజలు తీసుకోవాలి ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ ? అనే విషయాలను ప్రముఖ డైటీషియన్​ 'డాక్టర్​ శ్రీలత' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..!

చియా సీడ్స్ : సీడ్స్​లో మన శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం అధికంగా ఉంటుంది. చియా గింజలలో కూడా పీచు ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్​, నాణ్యమైన ప్రొటీన్​, అనేక రకాల ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సుమారు 2 టేబుల్​ స్పూన్ల చియా గింజల ద్వారా 10 గ్రాముల పీచుని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను పండ్ల రసాలలో లేదా బాదం పాలలో నానబెడితే మృదువుగా మారతాయి. ఆ తర్వాత వాటిని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు.

గుమ్మడి గింజలు : ఈ గింజలలో మన హెల్త్​కు మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ముఖ్యంగా ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలకు మేలు చేస్తుంది. గుమ్మడి గింజలను సూప్​లు, సలాడ్​లలో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

దానిమ్మ గింజలు : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్​ సి దానిమ్మ గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇంకా మన కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకోవడం మంచిదన చెబుతున్నారు.

క్వినోవా : మన ఆరోగ్యానికి మేలు చేసే గింజల్లో క్వినోవా కూడా ఒకటి. ధాన్యంలా కనిపించే వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సుమారు కప్పు క్వినోవా తీసుకోవడం ద్వారా 8 గ్రాముల ప్రొటీన్​ పొందవచ్చు. వీటిని అన్నంలాగానే వండాలి. ఉదయాన్నే క్వినోవా తినడం వల్ల పీచు పదార్థం, ప్రొటీన్​, ఇనుము పొందవచ్చని చెబుతున్నారు

అవిసె గింజలు : వీటిలో పీచు పదార్థం, ప్రొటీన్లు, ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటుతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్​ ప్రెషర్ నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. దాదాపు 2 టేబుల్​ స్పూన్ల అవిసె గింజల్లో 7 గ్రాముల ప్రొటీన్​ ఉంటుందని వివరిస్తున్నారు.

"పుచ్చకాయ, గుమ్మడికాయ, మస్క్​ మిలన్​ వంటి గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని ఏదోక రూపంలో డైలీ తినడం ద్వారా హెల్దీగా ఉండవచ్చు. టీస్పూన్​ నెయ్యి వేసి వీటిని ఫ్రై చేసి పిల్లలకు స్నాక్​లాగా ఇవ్వొచ్చు. వివిధ రకాల గింజలన్నింటినీ కలిపి లడ్డూలు చేసి ఇస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది." -డాక్టర్​ శ్రీలత (డైటీషియన్​)

పొద్దు తిరుగుడు విత్తనాలు : సన్​ఫ్లవర్​ సీడ్స్​లో విటమిన్ ఎ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.

నువ్వులు : నువ్వులలో ఫైబర్​, క్యాల్షియం, ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దీనిని పొడిలా చేసుకుని కూరలు, చట్నీల రూపంలో తినడం ద్వారా పోషకాలు సరిగ్గా అందుతాయి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చని డాక్టర్​ శ్రీలత చెబుతున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఎదిగే పిల్లలకు నువ్వులతో లడ్డూలు, చిక్కీలు చేసి ఇస్తే చాలా మంచిదని డాక్టర్​ శ్రీలత సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

ప్రొటీన్ కావాలంటే గుడ్డు, చికెన్ తినాల్సిన పని లేదు - డైలీ ఈ గింజలు కొన్ని తిన్నా చాలు!

గుమ్మడి గింజలు అందరూ తినాలా? - తింటే ఏం జరుగుతుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.