ETV Bharat / offbeat

పండుగ షాపింగ్ చేస్తున్నారా - ఈ మార్కెట్లో తక్కువ ధరకే బెస్ట్ రాఖీలు - Rakhi Festival 2024 - RAKHI FESTIVAL 2024

Rakhi Festival 2024 : ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మహిళలు తెగ షాపింగ్ చేస్తుంటారు. హైదరాబాద్​లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. స్థానికులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాఖీ సీజన్ నడుస్తోంది. మహిళలందరూ తమ సోదరులకు డిఫరెంట్​గా రాఖీలు కొనడానికి, అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరి వెళ్లి కొంటుంటారు. హైదరాబాద్​లోని ఏ మార్కెట్లో తక్కువ ధరలకే బెస్ట్ రాఖీలు దొరుకుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Best Rakhis Under Low Budget
Best Rakhis Under Low Budget (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:14 PM IST

Best Rakhis Under Low Budget : అన్నాచెల్లి అనుబంధానికి ప్రతీకగా జరుపునే రాఖీ పండుగ రానే వచ్చింది. ఈ పండుగా జరుపుకోడానికి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. మొదట్లో రాఖీ పండుగా ఉత్తర, పశ్చిమ భారతంలోనే జరుపుకునేవారట. రానురాను అది దేశమంతటా వ్యాపించింది. ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే ఏదో ఒక రాఖీ కొని వెళ్లి కట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మహిళలు తమ సోదరులకు కట్టే రాఖీలు డిఫరెంట్​గా ఉండాలి అనుకుంటారు.

మహిళలను ఆకట్టుకోడానికి వ్యాపారులు కూడా వివిధ రకాల రాఖీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సగటు మహిళలు తక్కువ బడ్జెట్​లో మంచి రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయో అని ఆన్​లైన్లో తెగ వెతికేస్తుంటారు. రాఖీలను విక్రయించే షాప్స్ వివరాలు తెలుసుకుని అక్కడికి వెళ్లి మరి కొనుక్కుంటారు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ. హైదరాబాద్​లో ఎక్కడ తక్కువ బడ్జెట్​లో మంచి రాఖీలు దొరుకుతాయో తెలుసుకుందాం.

బేగంబజార్​కు వెళ్తే చాలు : హైదరాబాద్​లో తక్కువ ధరకే మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే టక్కున గుర్తుకు వచ్చేది బేగంబజార్. అక్కడ తినే వస్తువుల నుంచి ప్రతిదీ హోల్​సేల్​ రేట్లలో దొరుకుతాయి. ఇక్కడ వ్యాపారం చేసేవారు అధికంగా మార్వాడిలే. ఇక్కడ రాఖీ పండుగ సీజన్ మొదలైదంటే చాలు వ్యాపారులే ప్రత్యేకంగా వాటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అది కూడా తక్కువ ధరల్లోనే. తెలుసా ఈ మార్కెట్లో రూ.5 నుంచి రాఖీలు దొరుకుతాయి. హైదరాబాద్​లో పలు మార్కెట్లలో రాఖీలు ఇక్కడి నుంచే తీసుకెళ్లి విక్రయిస్తారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఎక్కడ కొనాలా అని ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయొచ్చు.

రాఖీ శుభ ముహూర్తం అప్పుడే! - ఈ సమయంలో రాఖీ కడితే కష్టాలు - ఈ సమయంలో కడితే విష్ణుమూర్తి అనుగ్రహం! - Rakhi Festival Date and Timings

ఇక్కడ రాఖీలు కొని ఇళ్లకు పయనం : రాజధానిలో మరో బిజినెస్ సెంటర్ సికింద్రాబాద్. నగరం నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే సికింద్రాబాదే. అలాగే నగర చుట్టుపక్కల ఊళ్లో ప్రజలు ఇక్కడి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఏ పండుగ వచ్చినా సికింద్రాబాద్ మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సికింద్రాబాద్​లో షాపింగ్ చేసి వెళ్తుంటారు. రాఖీ పండుగకు ఊళ్లకు వెళ్లే మహిళలు చాలా వరకు ఇక్కడే రాఖీలు కొని వెళ్తుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి రాఖీలను తీసుకొచ్చి సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తుంటారు. దీంతో ఇక్కడ రాఖీలకు బాగానే డిమాండ్ ఉంటుంది. అమ్మేవారు కాస్త ధర ఎక్కువ చెబితే మాత్రం బేరం ఆడాల్సిందే.

స్ట్రీట్ షాపింగ్ : మహిళలకు ఎంత బ్రాండెడ్ వస్తువులు కొన్నా స్ట్రీట్ షాపింగ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఎక్కడా దొరకని వస్తువులు మనకు స్ట్రీట్ షాప్స్​లో కనిపిస్తుంటాయి. వాటి ధర కూడా కాస్త తక్కువే ఉంటుంది. హైదరాబాద్​లో స్ట్రీట్ షాపింగ్ అంటే కోఠి, అమీర్​పేట్, దిల్​సుఖ్​నగర్ గుర్తొస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కాలేజీ విద్యార్థులు షాపింగ్ చేస్తుంటారు కారణం రీజనబుల్ ప్రైస్. పండుగలొస్తే హాస్టల్స్​ ఉండే విద్యార్థులు, ఉద్యోగిణులు ఈ మార్కెట్లకు పోటెత్తుతుంటారు. ఇక్కడ కూడా చాలా రకాల రాఖీలు దొరుకుతాయి అవి కూడా తక్కువ ధరల్లోనే అందుకే ఇక్కడ చదువుకునే విద్యార్థినిలు షాపింగ్ చేస్తుంటారు. హైదరాబాద్​లో రాఖీ పండుగ షాపింగ్ చేయాలి అనుకునే వారు ఈ మార్కెట్లలో కొనుగోలు చేస్తే తక్కువ ధరల్లోనే డిఫరెంట్ రాఖీలు కొనవచ్చు.

మీ సోదరుడి కోసం మీరే స్వయంగా రాఖీ తయారు చేయండి - మీ గుర్తుగా భద్రంగా దాచుకుంటారు! - How to Make Rakhi at Home

రాఖీ పండుగ వేళ మహాలక్ష్మిలకు మరో బంపర్​ ఆఫర్​ - ఆర్టీసీ కీలక నిర్ణయం ఏంటంటే? - Telangana RTC Rakhi Offer 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.