ETV Bharat / offbeat

సండే స్పెషల్​ : అద్దిరిపోయే బెంగాలీ స్టైల్​ "చేపల పులుసు"- ఈ విధంగా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

- నార్మల్​ చేపల పులుసుకి మించిన టేస్ట్​ - ఇలా చేస్తే నిమిషాల్లోనే ఘుమఘుమలు

Bengali Style Fish Curry
Bengali Style Fish Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Bengali Style Fish Curry : సండే కోసం నాన్​వెజ్​ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆదివారం రోజున ఇంట్లో తప్పకుండా చికెన్​, మటన్​తో చేసిన వంటకాలు చేసుకుని తింటారు. అయితే, ఈ సండేనాడు ఎప్పుడూ చికెన్​, మటన్​ కాకుండా చేపలతో కొత్త రెసిపీ ఒకటి ప్రిపేర్​ చేయండి. అది కూడా బెంగాలీ స్టైల్లో​ చేపల పులుసు చేయండి. మన దగ్గర చేసే చేపల పులుసులానే ఈ రకం చేపల పులుసు టేస్ట్​ అద్దిరిపోతుంది. దీనిని చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన బెంగాలీ స్టైల్​ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • చేప ముక్కలు-అరకేజీ
  • పొటాటోలు-3
  • కారం - రుచికి సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - టీ స్పూన్​
  • అల్లం ముక్కలు-4 చిన్నవి
  • ఎండుమిర్చి-8
  • టమాటాలు-3
  • ఆవాల నూనె-అరకప్పు
  • ఉల్లిపాయలు - 2
  • జీలకర్ర పొడి- టీ స్పూన్
  • ధనియాలపొడి- అర టీ స్పూన్
  • కశ్మీరి కారం- అర టీ స్పూన్
  • పచ్చిమిర్చి -4
  • పసుపు - కొద్దిగా
  • బిర్యానీ ఆకులు-3
  • కలోంజి సీడ్స్​- పావు టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం..

  • ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి.
  • తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మరొసారి గ్రైండ్​ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • తర్వాత పొటాటోలపైన చెక్కు తీయండి. వాటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి ఆవాల నూనె వేసుకోండి. (మీకు అచ్చం బెంగాలీ స్టైల్​ చేపల కూర రుచి రావాలంటే.. ఆవాల నూనె మాత్రమే యూజ్​ చేయాలి.)
  • నూనె వేడైన తర్వాత చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి.
  • రెండువైపులా చేప ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే నూనెలో బంగాళాదుంప ముక్కలు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి.
  • పాన్​లో నుంచి పావు కప్పు ఆయిల్​ తీసేయండి.(ఈ నూనెను ఇతర వంటలకు వాడుకోవచ్చు)
  • ఇప్పుడు పాన్​లో బిర్యానీ ఆకులు, కలోంజి సీడ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న అల్లం ఎండు మిర్చి పేస్ట్​ వేసి కలపండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి.
  • తర్వాత కొద్దిగా పంచదార వేసి కలపండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాలపొడి, కశ్మీరి కారం, కొన్ని నీళ్లు పోసి కలపండి.
  • మసాలా మిశ్రమం కాస్త వేగిన తర్వాత వేపుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలపండి.
  • తర్వాత వేడేవేడి నీళ్లు రెండు గ్లాసులు పోసి మూత పెట్టి మరిగించండి.
  • ఐదు నిమిషాల తర్వాత వేపుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోండి.
  • నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా చేసుకుంటే వేడివేడిగా ఎంతో ఘుమఘుమలాడే బెంగాలీ స్టైల్​ చేపల పులుసు రెడీ. నచ్చితే మీరు కూడా ఇలా చేపల పులుసు ట్రై చేయండి.

నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్​ కేక అంతే!

ఫిష్​ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.