ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "బీరకాయ కొత్తిమీర పచ్చడి" - వేడివేడి అన్నంతో తింటే జిందగీ ఖుష్​ అవ్వాల్సిందే! - Beerakaya Kotthimeera Pachadi - BEERAKAYA KOTTHIMEERA PACHADI

Beerakaya Kotthimeera Pachadi: బీరకాయ.. చాలా మంది ఇష్టంగా తినే కూరగాయ. అయితే బీరకాయతో కూరలంటే పాలు పోసి లేదా కోడి గుడ్డు వేసి వండటం మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ బీరకాయతో కూర మాత్రమే కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీని రుచి అద్దిరిపోతుంది. మీరూ ఓ సారి ట్రై చేయండి..

Beerakaya Kotthimeera Pachadi Recipe
Beerakaya Kotthimeera Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 1:44 PM IST

Beerakaya Kotthimeera Pachadi Recipe : వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి, కూసింత నెయ్యి వేసుకుని తింటుంటే వచ్చే మజానే వేరు. ఎన్ని కూరలున్నా దీని టేస్ట్​ మరేదానికి ఉండదు. ఇక రోటి పచ్చడి అనగానే అందరికీ టమాటాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే టమాటా ప్లేస్​లో బీరకాయ చేర్చుకోండి. అవునండీ.. బీరకాయ కొత్తిమీర పచ్చడి చేసుకుని తింటుంటే ఆహా అనాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించేంత బాగుంటుంది ఈ పచ్చడి రుచి. మరి మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ స్టోరీలో మేము వివరంగా అందిస్తున్నాము. ఓ సారి ట్రై చేయండి.

బీరకాయ కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - ఒకటిన్నర టేబుల్​ స్పూన్లు
  • ​ జీలకర్ర - 1 టీ స్పూన్
  • పల్లీలు - 2 టేబుల్​ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • పచ్చిమిర్చి - 15
  • బీరకాయలు - అర కేజీ
  • పండిన టమాటలు - 3
  • ఉల్లిపాయ - 1
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - నిమ్మకాయంత
  • కొత్తిమీర - 100 గ్రాములు

తాళింపు కోసం

  • నూనె - రెండు టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - పావు టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

5 నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి - వేడి వేడి అన్నంలో అమృతమే!

తయారీ విధానం:

  • ముందుగా బీరకాయలను పొట్టు తీసుకుని మీడియం సైజులో ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి రెండు టేబుల్​ స్పూన్ల నూనె వేసి ధనియాలు,​ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పల్లీలు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పచ్చిమిర్చి(ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని వేసుకోవచ్చు) వేసి అవి కాస్తా రంగు మారేంతవరకు వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీ జార్​లో వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • మళ్లీ స్టవ్​ ఆన్​ చేసి పచ్చిమిర్చి వేయించిన కళాయి పెట్టి అందులో 2 టేబుల్​ స్పూన్ల నూనె వేసి ముందుగానే కట్​ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసి మెత్తగా మగ్గేవరకు అంటే ఓ 12 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత పండిన టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత చింతపండు వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి కొత్తమీర తరుగు కాడలతో సహా వేసుకుని కలిపి మూత పెట్టి ఓ నాలుగు నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని, ముందుగానే రుబ్బుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కలిపి రోట్లో లేదా మిక్సీజార్​లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి రెండు టేబుల్​ స్పూన్లు ఆయిల్​ వేసి వేడిచేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఓ టీ స్పూన్​ ఆవాలు, ఓ టీ స్పూన్​ మినపప్పు, టేబుల్​ స్పూన్​ పచ్చి శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్​ జీలకర్ర, కరివేపాకు వేసి కాస్తా మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత పావు టీ స్పూన్​ ఇంగువ వేసుకుని కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకోని.. అందులోకి రుబ్బుకున్న పచ్చడిని వేసి పైన కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపుకుంటే సరి.. అద్దిరిపోయే రుచితో బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ.
  • దీన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే ఉంటుంది ఆ మజా! మరి మీరు ట్రై చేయండి.

ఇవీ చదవండి:

నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!

ఆంధ్రా స్టైల్ "దొండకాయ రోటి పచ్చడి" - ఇలా చేస్తే అదిరిపోద్ది - వేడి వేడి అన్నంలో కేక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.