ETV Bharat / offbeat

బేకింగ్ సోడాతో నోటి దుర్వాసన నుంచి - జీర్ణ, కిడ్నీ సమస్యల దాకా అన్నిటికీ చెక్! - Baking Soda Benefits - BAKING SODA BENEFITS

Baking Soda Health Benefits : ఇంట్లో తరచూ వాడే బేకింగ్ సోడా వంటలకే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్​ను తగ్గించడంలో మంచి హోమ్ రెమిడీగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి, బేకింగ్ సోడాతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

Health Benefits Of Baking Soda
Baking Soda Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 10:29 AM IST

Health Benefits Of Baking Soda : ప్రతీ ఒక్కరి వంటింట్లో కనిపించే ఆహార పదార్థాలలో ఒకటి.. బేకింగ్ సోడా. ఏదైనా పిండి వంటకాలు చేసుకుంటున్నప్పుడైతే అది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ బేకింగ్ సోడానే సోడియం బైకార్బోనేట్, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే.. వంటసోడా వంటలకు మంచి రుచిని ఇవ్వడం మాత్రమే కాదు.. దాంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, బేకింగ్ సోడాను(Baking Soda) ఎలా ఉపయోగిస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మంచి మౌత్ వాష్​ : మనం తింటున్న స్పైసీ ఫుడ్స్ కీ, తాగుతున్న కాఫీ టీలకీ కేవలం రెండు పూటలా దంతాలు బ్రష్ చేసుకుంటే సరిపోదు. మౌత్ వాష్ కూడా అవసరం అవుతుంది. అలాంటి టైమ్​లో ప్రత్యేకంగా మౌత్ వాష్ కొనాల్సిన పనిలేదు. గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మౌత్ వాష్ లా యూజ్ చేయొచ్చు. ఇది నోటి పుళ్ళని తగ్గించడమే కాకుండా దంతాలు తెల్లగా మెరిసేటట్లు చేస్తుందంటున్నారు డాక్టర్ కె. శివరాజు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్. అలాగే.. శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు బేకింగ్​ సోడా వాడటం ద్వారా చెక్​ పెట్టొచ్చంటున్నారు.

కిడ్నీ ఆరోగ్యానికి మేలు : క్రానిక్ కిడ్నీ డిసీజెస్ నెమ్మదిగా కిడ్నీ ఫెయిల్యూర్​కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనంలో బేకింగ్ సోడా సప్లిమెంట్లు తీసుకునే వారు ముప్ఫై ఆరు శాతం తక్కువ స్పీడ్​తో కిడ్నీ ఫెయిల్యూర్ దశ కి చేరుకుంటారని తేలింది. ఇందుకు బేకింగ్ సోడాలోని సోడియం బైకార్బొనేట్ చాలా బాగా ఉపకరిస్తుందట. అందుకే బేకింగ్ సోడా కొద్ది మొత్తంలో ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు డాక్టర్ శివరాజు.

జీర్ణ సమస్యలకు చెక్ : మనం కొన్నిసార్లు ఎక్కువ తిన్నా, సరిగ్గా అరక్కపోయినా, గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఆ మంట పొట్టలో నుంచి గొంతు వరకూ తెలుస్తుంది. అలాంటి టైమ్​లో ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకొని నెమ్మదిగా తాగితే గుండెల్లో మంట(National Library of Medicine రిపోర్టు) నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు వైద్యులు. అలాగే.. ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి వాటి నుంచి వేగంగా రిలీఫ్ పొందవచ్చంటున్నారు.

చర్మ సమస్యలు దూరం : దోమకుట్టిన ప్రాంతంలో దద్దుర్లు, దురద, ఎర్రదనాన్ని పోగొట్టడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు డాక్టర్ శివరాజు. ఇందుకోసం మూడు వంతుల బేకింగ్​ సోడాను ఒకవంతు నీటిలో కలిసి దోమకుట్టిన ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే.. నొప్పిని, మంటను తగ్గించే గుణం కూడా బేకింగ్​ సోడాకు ఉందని చెబుతున్నారు.

ఇవేకాకుండా.. కిమోథెరపీ చికిత్సలో వాడే మందుల ఆమ్ల లక్షణాలను ఎదుర్కోవడానికి కూడా వంట సోడా ఉపయోగపడుతుంది. తక్కువ ఆమ్లస్థాయి ట్యూమర్స్​ పెరగకుండా వ్యాప్తి చెందకుండా నియంత్రించగలిగే గుణాలు బేకింగ్ సోడాలో ఉంటాయంటున్నారు. అలాగే.. యూటీఐ సమస్యలను తగ్గించడంలో సోడియం బై కార్బొనేట్ సహాయపడుతుందట.

పాదాలు మృదువుగా చేయడంలో బేకింగ్ సోడా ఉపయోగపడుతుందంటున్నారు. ఇందుకోసం.. బకెట్​లో కొద్దిగా బేకింగ్ సోడాను వేసి పాదాలను కాసేపు నానబెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. చివరగా.. బేకింగ్ సోడాతో ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ జాగ్రత్తగా, మితంగా ఉపయోగించడం చాలా అవసరమని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

బేకింగ్​ పౌడర్​ Vs బేకింగ్​ సోడా - ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

'ఈనో' తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.