ETV Bharat / offbeat

ఎప్పుడైనా "టమాటా బజ్జీలు" తిన్నారా? - ఇలా ఓసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి! - మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఎప్పుడూ రొటిన్​గా మిర్చి బజ్జీలు తిని బోరింగ్​గా అనిపిస్తోందా? - ఈ సూపర్ స్నాక్ రెసిపీని ట్రై చేయండి!

How to Make Tomato Bajji
Tomato Bajji Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 6:56 PM IST

How to Make Tomato Bajji Recipe : ఎక్కువ మందికి సాయంకాలం పూట ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది అలా బయటకు వెళ్లి బజ్జీలు, పునుగులు, పకోడీ, సమోసాలు వంటి స్ట్రీట్ ఫుడ్స్​ని ఆస్వాదిస్తుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు మిర్చి, ఆలూ, అరటికాయ బజ్జీలు తినుంటారు. కానీ, ఎప్పుడైనా ఆంధ్ర స్టైల్ "టమాటా బజ్జీల"ను టేస్ట్ చేశారా? లేదంటే మాత్రం ఓసారి తప్పకుండా వీటిని ట్రై చేయాల్సిందే. రుచిలో బండి మీద దొరికే వాటికి ఏమాత్రం తీసిపోవు! ఇంతకీ.. ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
  • వాము - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్
  • బేకింగ్ సోడా - చిటికెడు
  • నూనె - వేయించడానికి తగినంత
  • పల్లీలు - పావు కప్పు
  • టమాటాలు - 4

స్టఫింగ్ కోసం :

  • మరమరాలు - అర కప్పు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కారం - అరటీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • చాట్ మసాలా - అరటీస్పూన్
  • వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్ - అర కప్పు

సూపర్ స్నాక్ రెసిపీ - క్రిస్పీ "సొరకాయ బజ్జీలు" - 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, వాము, ఉప్పు, పసుపు, బేకింగ్ సోడా.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ జారుడుగా కాకుండా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన టమాటాలను శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా క్లాత్​తో తుడుచుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో టమాటాలను డిప్ చేసి కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి.
  • ఆపై వాటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే నూనెలో పల్లీలను వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా వేయించుకొని పక్కన ఉంచుకున్న బజ్జీలను మధ్యలోకి కట్ చేసుకొని.. జాగ్రత్తగా అందులోని టమాటాలను బయటకు తీసేయాలి.
  • తర్వాత ఆ టమాటాల పై పొట్టును తీసేసి ఒక బౌల్​లో వేసుకోవాలి. ఆపై వాటిని చేతితో క్రష్ చేస్తూ గుజ్జులాగా చేసుకోవాలి.
  • అనంతరం అందులో మరమరాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్ వేసుకొని అన్నీ కలిసేలా ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత టమాటాలు తొలగించిన డొప్పలన్నింటిలో మీరు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్​ని నెమ్మదిగా నింపుకోవాలి.
  • ఇక చివరగా వాటిపైన వేయించుకున్న పల్లీలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ "టమాటా బజ్జీలు" రెడీ!

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.