ETV Bharat / offbeat

కొలెస్ట్రాల్ తగ్గించి బరువును కంట్రోల్​లో ఉంచే "అలసీ పిన్నీ" - సింపుల్​గా చేసుకోండిలా! - ALSI PINNI RECIPE

మీరు ఇప్పటి వరకు రుచి చూడని "అలసీ పిన్నీ" స్వీట్ - ఇప్పుడే ఓసారి ఇలా ట్రై చేయండి!

How to Make Alsi Pinni
Alsi Pinni Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 7:52 PM IST

Alsi Pinni Recipe in Telugu : కొన్ని రెసిపీల పేర్లు భలే తమాషాగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే "అలసీ పిన్నీ" మిఠాయి రెసిపీ కూడా అదే కోవకు చెందుతుంది. ఇక్కడ పిన్నీ లేదు, అలసిపోయే ప్రసక్తీ లేదు. ఇది హరియాణా వారి స్పెషల్ స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ మరో పేరు.. "అవిసె గింజల లడ్డూ". మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల తీపి వంటకాలు ట్రై చేసి ఉంటారు.

కానీ, ఓసారి ఈ స్పెషల్ స్వీట్​ను ట్రై చేయండి. పైగా ఈ లడ్డూలో పోషకాలు అధికం. చెడు కొలెస్ట్రాల్​ను నియంత్రిస్తాయి. బరువు పెరుగుతారన్న బాధ ఉండదు. ఆరోగ్యానికి అవిసె గింజలు మంచివని ఆహార నిపుణులు నేపథ్యంలో.. ఓసారి "అలసీ పిన్నీ లడ్డూ" ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది కదా! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • అవిసె గింజలు - అర కిలో
  • గోధుమపిండి - ముప్పావు కిలో
  • వెన్న - అర కిలో
  • బెల్లం - ముప్పావు కిలో
  • శనగలు - 200 గ్రాములు
  • పల్లీలు - 2 టేబుల్​స్పూన్లు
  • వాల్​నట్స్ - 2 టేబుల్​స్పూన్లు
  • ఖర్జూరాలు - పావు కప్పు
  • కిస్​మిస్ - 2 టేబుల్​స్పూన్లు
  • గుమ్మడి గింజలు - రెండు టేబుల్​స్పూన్లు
  • నువ్వులు - రెండు టేబుల్​స్పూన్లు
  • పిస్తా - 2 టేబుల్​స్పూన్లు
  • బాదం - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - 2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్ మీద అవిసె గింజలను డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో పల్లీలు, శనగలు, నువ్వులు, గుమ్మడిగింజలు, డ్రైఫ్రూట్స్​ను కూడా దోరగా వేయించుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా అవిసెగింజలను తీసుకొని పొడిలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత అదే మిక్సీ జార్​లో వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగలు, నువ్వులు, గుమ్మడిగింజలు, డ్రైఫ్రూట్స్​ మిశ్రమాన్ని మెత్తని పౌడర్​లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మళ్లీ అదే కడాయి పెట్టుకొని వెన్నను వేసి వేడి చేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక అందులో గోధుమపిండిని వేసుకొని కలుపుతూ కాసేపు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అదే మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడి, డ్రైఫ్రూట్స్‌ పౌడర్‌ వేసి కలియ తిప్పుతూ ఇంకాస్త వేగనివ్వాలి. ఇలా వేయించుకునేటప్పుడు మంట వీలైనంత తక్కువగానే ఉండేలా చూసుకోవాలి.
  • ఇంకో బర్నర్ మీద మరో పాత్ర పెట్టుకొని కప్పు నీళ్లు, బెల్లం వేసి మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి పాకంలా మారాక స్టౌ ఆఫ్ చేసుకొని ఈ సిరప్​ను అవిసె గింజల మిశ్రమంలో మెల్లగా పోస్తూ.. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
  • అలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే అందులో కిస్‌మిస్, ఖర్జూర పండు ముక్కలు కూడా వేసి మిశ్రమం మొత్తం కలిసేలా కలియతిప్పుకోవాలి.
  • ఎప్పుడైతే మిశ్రమం మొత్తం కలిసిపోయి, దగ్గరగా అయ్యిందనిపిస్తే స్టౌ ఆఫ్ చేసుకొని కడాయిని దించేయాలి.
  • ఇక ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "అలసీ పిన్నీ లడ్డూలు" రెడీ!

ఇవీ చదవండి :

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.