World Longest Lived Dog : విశ్వాసానికి మారుపేరు కుక్క. ఒక్కసారి కడుపు నింపితే చాలు మన వెంటే జీవితాంతం ఉంటాయి. అందుకే కుక్కను మనిషికి మంచి స్నేహితుడిగా చెప్పుకోవచ్చు. అయితే ఏ జాతి కుక్క అయినా దాని జీవితకాలం 20 సంవత్సరాల లోపే ఉంటుంది. అయితే ఒక కుక్క మాత్రం అత్యధిక కాలం బతికి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాలో బ్లూయ్ అనే కుక్క ఏకంగా 29 సంవత్సరాల 5 నెలలు బతికింది. అంటే సుమారు దాని జీవిత కాలం కంటే 2 రేట్లు ఎక్కువ.
ఏ జంతువు గురించి తెలుసుకోవాలన్నా దానిపై జరిగే పరిశోధనల గురించి తెలుసుకోవాలి. ఇవి కొన్ని వింతగా ఉంటాయి, మరికొన్ని వింత ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు మగ కుక్క జీవితకాలం ఆడ కుక్క జీవిత కాలానికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. అంతే కాదు చూడటానికి పెద్ద పరిమాణంలో ఉన్న కుక్క జీవితకాలం కంటే చిన్నగా ముద్దుగా ఉండే కుక్క ఎక్కువ కాలం బతుకుతుందట.
ఇక ఈ రెండింటికంటే క్రాస్ బ్రీడ్ అయితే ఇంకా ఎక్కువ కాలం బతుకుతాయట. ఫ్రెంచ్ మాస్టిఫ్ అనే జాతి కుక్క అత్యంత తక్కువ కాలం అంటే సుమారు 5 నుంచి 8 ఏళ్లు మాత్రమే బతుకుతాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కుక్కలు కూడా వయసు పెరిగే కొద్ది మనలాగే స్థూలకాయం, మధుమేహం, కీళ్ల నొప్పులు అనుభవిస్తాయి. కుక్క మెట్లు ఎక్కలేకపోవడం, దూకడం వంటివి చేయకపోవడం చేస్తుంటే వృద్ధాప్యం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 10 మిలియన్ సంత్సరాలకు పూర్వం కుక్క ఆకారంలో ఉన్న టోమార్క్ టాస్ అనే చిన్న జంతువులు ఈ నాటి కుక్కలకు పూర్వీకులుగా చెప్పవచ్చు. అంటే క్రీస్తు పూర్వం నుంచి ప్రపంచడంలో అనేక ప్రాంతాల్లో మానవులు తన అవసరాల కోసమో, సరదా కోసమో తమకు నచ్చిన జంతువులను పెంచుతూ వచ్చారన్నమాట. ఇక విశ్వాసంగా ఉండే జాతుల్లో కుక్క ఒకటి కావడం వల్ల చాలా మంది వాటిని పెంచుకోవడం అలవాటుగా మార్చుకొని ఉండవచ్చు.