ETV Bharat / international

ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్​కు గట్టి పోటీ- ఆమెపై పైచేయి సాధించేనా? - us vice president candidates 2024

Vivek Ramaswamy US Polls : రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి గట్టి పోటీ ఎదురవుతోంది. రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఓ సర్వేలో సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్​, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(38) చెరో 15శాతం ఓట్లు పొందారు.

Vivek Ramaswamy US Polls
Vivek Ramaswamy US Polls
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 6:08 PM IST

Vivek Ramaswamy US Polls : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడి, వెనకడుగు వేసిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంలోనూ గట్టి పోటీ ఎదురైంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ఉన్న డొనాల్డ్​ ట్రంప్​నకు రన్నింగ్ మేట్ ​(ఉపాధ్యక్ష అభ్యర్థి)గా ఎవరు ఉండాలనే విషయంలో చేపట్టిన పోల్​లో సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్​, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(38) చెరో 15శాతం ఓట్లు పొందారు. నాలుగు రోజుల పాటు వాషింగ్టన్​లో జరిగిన రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ పోల్ నిర్వహించారు.

US Polls 2024 Vivek : భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. 2024 జనవరిలో జరిగిన అయోవా​ ప్రైమరీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న క్రిస్టి నోయెమ్ 2018లో ట్రంప్ మద్దతుతో సౌత్ డకోటాకు మొదటి మహిళా గవర్నర్​గా ఎన్నికయ్యారు. కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి సమయంలో టీకాలు వేయించుకోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించడానికి రాష్ట్రవ్యాప్త ఆదేశాలను జారీ చేయడానికి ఆమె నిరాకరించడం వల్ల వార్తల్లో నిలిచారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఎవరు ఉండాలనే ప్రశ్న కన్నా ఈ సారి ఉపాధ్యక్ష బరిలో ఎవరుండాలి? అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ 94శాతం ఓట్లు సాధించగా, ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 5 శాతానికి పరిమితమయ్యారు. అలాగే మాజీ ఉపాధ్యక్షుడు మెక్ పెన్స్ లేకుండా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ట్రంప్​, మైక్ పెన్స్ మధ్య గొడవలు జరగడం వల్ల వీరిద్దరు విడిపోయారు.

మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రైమరీలో ఆదివారం విజయం సాధించారు. తన ప్రత్యర్థి నిక్కీ హేలీనీ ఆమె సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలోనే సునాయాసంగా ఓడించారు. ఇప్పటికే అయోవా, న్యూ హాంప్‌షైర్‌, నెవాడా రాష్ట్రాల ప్రైమరీల్లో ట్రంప్‌ గెలుపొందారు.

అలా మెరిసి ఇలా మాయం- అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ బయటకు- ఇకపై ఆయన కోసమే ప్రచారం!

Vivek Ramaswamy Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి జోరు.. ట్రంప్ తర్వాత స్థానంలో మనోడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.