ETV Bharat / international

వెనెజువెలా ఎన్నికల్లో నికోలస్ మడురో విజయం - అక్రమంగా గెలిచారన్న విపక్షం - Venezuela Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 10:11 AM IST

Updated : Jul 29, 2024, 12:19 PM IST

Venezuela Elections 2024 :వెనెజువెలాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో విజేతగా నిలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. మడురో అక్రమంగా గెలిచారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

Venezuela Elections 2024
Venezuela Elections 2024 (Associated press)

Venezuela Elections 2024 : అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న విపక్షాల ఆరోపణల మధ్యే వెనెజువెలాలో అధికార పార్టీ విజయం సాధించినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో 51 శాతం ఓట్లతో గెలుపొందినట్లు పేర్కొంది. ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న విశ్రాంత దౌత్యవేత్త ఎడ్మండో గొంజాలెజ్​కు 44 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది.

ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపు 12 గంటల పాటు సాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 8 మంది బరిలో ఉన్నారు. వారిలో మడురో, గొంజాలెజ్​ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో 25 ఏళ్ల పాలకు వెనెజువెలా ప్రజలు ముగింపు పలుకుతారని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. వేతనాల్లో కోత, ఆకలి కేకలు, వలసలు చమురు పరిశ్రమలో సంక్షోభవం వంటి సమస్యలతో వెనెజువెలా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మడురోకు ఓటమి తప్పదని చాలా మంది భావించారు. కానీ ప్రజలు మాత్రం నికోలస్​ మడురోకు వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Venezuela Elections 2024
మడురో మద్ధతుగా ప్రజలు (Associated Press)

ప్రత్యర్థిపై అనర్హత వేటు
2013లో అప్పటి అధ్యక్షుడు చావెజ్ మరణంతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన మడురో తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో నాలుగు నెలల ముందే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మడురోకు పోటీగా 56 ఏళ్ల మరియా మచాడో అధ్యక్ష బరిలోకి దిగారు. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కొద్ది రోజులకే ప్రభుత్వ కాంప్ట్రోలర్ జనరల్​ ఆమెపై అనర్హత వేటు వేశారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 15 ఏళ్ల పాటు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించారు. న్యాయ పోరాటం చేస్తూనే ప్రైమరీల్లో పోటీ చేసి 93 శాతం ఓట్లు సాధించారు మడురో. ఈ నిషేధాన్ని వెనుజువెలా ఉన్నత కోర్టు కూడా సమర్థించడం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో పోటీగా గొంజాలెజ్​ను బరిలోకి దింపారు.

Venezuela Elections 2024
వెనెజువెలా అధ్యక్షుడు మడురో (Associated Press)

ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఫలితాలు
ఈ ఎన్నికల ఫలితాలు వెనెజువెలా ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బింక్లెన్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను నమ్మడం కష్టమని చిలీ వామపక్ష నాయకుడు గాబ్రియెల్ బోరిక్ అన్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని పేర్కొన్నాయి. గొంజాలెజ్​ మద్దతుగా ప్రతిపక్షాలు అన్ని ఏకమయ్యాయి. కౌటింగ్ కేంద్రాల వద్దకు తమ మద్ధతుదారులను పిలిపించాయి.

Venezuela Elections 2024
కౌటింగ్ కేంద్రాల వద్ద ప్రజలు (Associated Press)

Last Updated : Jul 29, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.