ETV Bharat / international

సంగీత కచేరీలో ఉగ్రవాదుల కాల్పులు - 60మంది మృతి, 145మందికి పైగా గాయాలు - Terror Attack In Russia - TERROR ATTACK IN RUSSIA

Terror Attack In Russia : రష్యా రాజధాని మాస్కోలోని అతి పెద్ద సంగీత కచేరీ హాలులో జరిగిన ఉగ్రవాద దాడిలో 60మంది మరణించారు. దాదాపు 145 మందికి గాయడ్డారు.

Terror Attack In Russia
Terror Attack In Russia
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 6:33 AM IST

Updated : Mar 23, 2024, 8:19 AM IST

Terror Attack In Russia : రష్యా రాజధాని మాస్కోలో సంగీత కచేరీలో జరిగిన ఉగ్రవాద దాడిలో60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 145 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మరోవైపు ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.

క్రాకస్​ సిటీలోని శుక్రవారం ఓ హాలులో జరుగుతున్న సంగీత కచేరీలోకి ముష్కరులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తొలుత క్రాకస్‌ సిటీ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరపడం సహా బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. అనంతరం సంగీత కార్యక్రమం జరుగుతున్న హాల్‌ లోపలికి వెళ్లి అక్కడ కూర్చున్న వారిపై కాల్పులకు దిగారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. ఉగ్రవాదులు తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పలకు తెగబడ్డారని అధికారులు తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత
ఈ దాడికి సంబంధించి సోషల్​ మీడియాలో పలు వీడియోలు వైరల్​ అవుతున్నాయి. సాయుధులు కాల్పులు జరపడం. ప్రజలు భయాందోళనలతో పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. పేలుళ్లకు క్రాకస్‌ సిటీ హాలు పైకప్పుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే మాస్కోలో ఈ వారంలో జరగాల్సిన పలు సమావేశాలను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

'దాడి చేసింది మేమే'
మరోవైపు ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తమ సామాజిక మాధ్యమాల్లోని అనుబంధ ఛానల్​లో ఈ మేరకు పోస్టు చేసింది. ఈ ఘటనపై అమెరికా వైట్‌హౌజ్‌ స్పందించింది. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆదేశ జాతీయ భద్రత సలహాదారు జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని తెలిపారు.

'రష్యా ప్రజలకు అండగా'
ఈ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్​ వేదికగా స్పందించారు. 'మాస్కోలో జరిగిన ఈ దారుణమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సమయంలో రష్యా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం' అని ప్రధాని మోదీ అన్నారు.

అతిపెద్ద ఉగ్రదాడి ఇదే
గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 2002లో చెచెన్‌ మిలిటెంట్లు మాస్కో థియేటర్‌లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో రష్యాన్‌ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారిని విడిపించాయి. ఈ క్రమంలో 129 మంది బందీలు, 41 మంది మిలిటెంట్లు చనిపోయారు. ఇక 2004లో 30 మంది చెచెన్‌ సాయుధులు బెస్లాన్‌లోని ఓ పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో సుమారు 330 మంది చనిపోయారు. వారిలో సగం వరకు చిన్నారులే ఉన్నారు.

పాక్‌-అఫ్గాన్‌ ఢీ- వైమానిక దాడుల్లో అనేక మంది మృతి- రంగంలోకి అమెరికా

ఇండియన్ నేవీ ఇంటెన్స్​ ఆపరేషన్- రంగంలోకి INS కోల్​కతా- పైరేట్స్​కు చుక్కలు చూపించిన కమాండోలు

Last Updated : Mar 23, 2024, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.