ETV Bharat / international

శ్రీలంక అధ్యక్ష పీఠం వైపు దూసుకెళ్తున్న దిసనాయకే - ప్రత్యర్థులకు అందనంత దూరంలో! - Sri Lanka Presidential Election2024

Dissanayaka Leads Sri Lanka's Presidential Vote : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్​పీపీ) పార్టీ నేత అనుర కుమార దిసనాయకే సత్తాచాటారు. ప్రత్యర్థుల కంటే భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Dissanayaka leads Sri Lanka's presidential vote
Dissanayaka leads Sri Lanka's presidential vote (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 10:27 AM IST

Dissanayaka Leads Sri Lanka's Presidential Vote : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్​పీపీ) పార్టీ నాయకుడు అనుర కుమార దిసనాయకే భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం ఉదయం 7గంటల వరకు ప్రకటించిన ఫలితాల్లో దిసనాయకే 7,27,000 (52 శాతం) ఓట్లను సాధించారు. సమగి జన బలవేగయ (ఎస్​జేబీ) పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్​ ప్రేమదాస 3,33,000 (23 శాతం) ఓట్లను పొందారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే 2,35,000 (16 శాతం) ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అలాగే 22 పోస్టల్ జిల్లాల ఓట్లలో 21 దిసనాయకే గెలుచుకున్నారు.

ఫలితాలపై స్పందించని విక్రమసింఘే
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఇంకా రణిల్ విక్రమసింఘే అంగీకరించలేదు. అయితే ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మాత్రం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆధిక్యంలో దూసుకెళ్తున్న అనుర కుమార దిసనాయకేను అభినందించారు. "సుదీర్ఘమైన ఎన్నికల ప్రచారం తర్వాత ఫలితాలు స్పష్టంగా వచ్చాయి. నేను అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోసం భారీగా ప్రచారం చేశాను. శ్రీలంక ప్రజలు అనుర కుమార దిసానాయకేకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. దిసనాయకే, అతని బృందానికి నా హృదయపూర్వక అభినందనలు" అని ఎక్స్​లో అలీ సబ్రీ పోస్టు చేశారు. మరోవైపు, ప్రతిపక్ష నేత ప్రేమదాస పార్టీకి చెందిన హర్ష డిసిల్వా కూడా దిసనాయకేను అభినందించారు.

భారీగా పుంజుకున్న దిసనాయకే
అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సాధించిన ఫలితం ఊహించని స్థాయిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో దిసనాయకేకు 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలో అవినీతిని రూపుమాపుతానని ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చారు దిసనాయకే. దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు.

తగ్గిన పోలింగ్ శాతం
శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 83 శాతం ఓటింగ్ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు.

Sri Lanka presidential election 2024
ప్రశాంతంగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు (Associated Press)
Sri Lanka presidential election 2024
క్యూలో నిలబడిన ఓటర్లు (Associated Press)
Sri Lanka presidential election 2024
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు (Associated Press)
Sri Lanka presidential election 2024
ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ (Associated Press)
Sri Lanka presidential election 2024
భారీగా నమోదైన పోలింగ్ (Associated Press)
Sri Lanka presidential election 2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​ (Associated Press)
Sri Lanka presidential election 2024
బ్యాలెట్ బాక్స్​ను భద్రపరుస్తున్న సిబ్బంది (Associated Press)
Sri Lanka presidential election 2024
బ్యాలెట్ బాక్స్ తరలిస్తున్న సిబ్బంది (Associated Press)

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు! కానీ ప్రజల మద్దతు ఆయనకే! - Sri Lanka Presidential Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.