ETV Bharat / international

'ఉక్రెయిన్​పై రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో మోదీదే ముఖ్యపాత్ర​!'

Russia Ukraine War Modi News : ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడిని నివారించడంలో భారత సహా చైనా అందించిన సహకారం ఎంతో దోహదం చేశాయని అమెరికాకు చెందిన ఇద్దరు అధికారులు ఓ ఇంగ్లిష్​ ఛానల్​కు చెప్పారు. అయితే ఈ విషయంలో అమెరికా 2022లోనే పూర్తి స్థాయి కసరత్తు చేసిందని వెల్లడించారు.

Russia India China
Russia India China
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 9:42 PM IST

Russia Ukraine War Modi News : ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడితే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై అగ్రరాజ్యం అమెరికా 2022లోనే పూర్తి సథాయి కసరత్తు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో అణుసంక్షోభ నివారణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత చేసిన ప్రకటనలు లేదా అందించిన సహకారం ముఖ్యపాత్ర పోషించాయని సదరు నివేదిక పేర్కొంది.

పుస్తకంలో ప్రస్తావన
వాస్తవానికి మాస్కో టాక్టికల్‌ అణుబాంబును ప్రయోగించే అవకాశాలున్నాయని వాషింగ్టన్‌ బలంగా విశ్వసించింది. ఈ విషయాన్ని జిమ్‌స్కాటో అనే జర్నలిస్టు తన పుస్తకం 'ది రిటర్న్‌ ఆఫ్‌ గ్రేట్‌ పవర్‌'లో ప్రస్తావించారు. ముఖ్యంగా కొన్ని అంచనాలు, సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత వాషింగ్టన్‌ ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పుతిన్​ ప్లాన్​
ఖేర్సాన్‌లో రష్యా ఎదురు దెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్‌ భావించింది. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడం వల్ల పుతిన్‌ ఈ దాడికి పచ్చజెండా ఊపవచ్చనుకున్నారు. ఆ సమయంలో తమ దాడికి అవసరమైన సాకు కూడా దానికి దొరికినట్లు భావించారు. దీనికి తగ్గట్లే ఉక్రెయిన్‌ డర్టీబాంబ్‌ కోసం యత్నిస్తోందని క్రెమ్లిన్‌ వర్గాలు తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి.

రష్యాను ఆశ్రయించిన అమెరికా
మరోవైపు రష్యా భారీ అణ్వాయుధాలు తరలిస్తే అమెరికా సులువుగా పసిగట్టేస్తుంది. అదే చిన్న సైజు టాక్టికల్‌ అణుబాంబులు తరలిస్తే గుర్తించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో వాటిని మాస్కో వాడే అవకాశాలున్నాయని ఆందోళన చెందింది. దీంతో అమెరికా వర్గాలు నేరుగా తమ భయాలను రష్యాకు తెలియజేశాయి. అదే సమయంలో తన సహచర దేశాలతో కలిసి ఈ దాడిని నివారించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. కాగా, దాడి చేస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాలను రష్యాకు తెలియజేసింది యూఎస్​.

ఇరు దేశాల సాయం కోరిన అమెరికా
అయితే రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు అమెరికా భారత్‌, చైనా దేశాల సాయం కోరింది. ఓ పక్క నేరుగా మాస్కోను హెచ్చరిస్తూనే మరోవైపు ఇతర దేశాలతో కూడా దానికి చెప్పించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు కొంత మేరకు సంక్షోభ భయాలు సర్దుమణిగేందుకు దోహదపడ్డాయి. ఆ తర్వాత యుద్ధం ప్రతిష్ఠంభన దశకు చేరడం వల్ల అణుదాడి ఆందోళనలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాలను మొత్తం ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

దుబాయ్​లో భారీ వర్షాలు- నదులుగా మారిన రోడ్లు- విమానాలు రద్దు!

భారీ వరదలకు 21మంది బలి- వేల ఇళ్లు ధ్వంసం- ప్రజలకు నరకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.