ETV Bharat / international

యుద్ధానికి సిద్ధమవుతున్న ఇరాన్, ఇజ్రాయెల్​ - అగ్నికి ఆజ్యం పోస్తున్న రష్యా! - Israel Iran War Preparations

Israel Iran War Preparations : ఇరాన్, ఇజ్రాయెల్‌ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరుదేశాల స్పరస్పర దాడులతో ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చు అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇరుదేశాలు సాయుధ సంపత్తిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

Israel Iran War Preparations
Israel Iran War Preparations (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 7:54 AM IST

Iran Preparing Rocket Launchers For Israel Attack : ఇరాన్, ఇజ్రాయెల్‌లు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. యుద్ధానికి అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకునే పనిలో రెండు దేశాలు తలమునకలయ్యాయి. దీంతో ఏ క్షణమైనా యుద్ధం మొదలుకావొచ్చునన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిలా రగులుతోంది. యుద్ధానికి సన్నాహంగా అన్నట్లు ఇజ్రాయెల్‌ బుధవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడితో హెజ్‌బొల్లాకు చెందిన పలువురు మరణించినట్లు తెలుస్తోంది. దాడికి ప్రతిదాడిగా హెజ్‌బొల్లాకు చెందిన డ్రోన్లు ఇజ్రాయెల్‌లోని నహారియా నగరంపై పడి విధ్వంసం సృష్టించాయి.

ఇరాన్‌కు రష్యా అండదండలు : మరోవైపు ఇరాన్‌ అనుకూల మిలీషియా సభ్యులు ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడి చేశారు. ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్‌కు గట్టిగా బుద్ధిచెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఇరాన్‌, మిత్రదేశమైన రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. రష్యా ఇరాన్‌కు అధునాతన రాడార్‌ వ్యవస్థలతో పాటుగా క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా నేత సెర్గీ షొయిగు ఇరాన్‌ వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆయుధాల సరఫరాలు మొదలయినట్లు సమాచారం. అయితే దాడి చేసినా, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇరాన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

దాడులపై కన్నేసిన అమెరికా : పశ్చిమాసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అమెరికా - మరిన్ని బలగాల్ని ఆ ప్రాంతానికి పంపుతోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే, దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌కు నచ్చచెప్పే పనిలో అమెరికా నిమగ్నమైంది. ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయి ప్రతిఘటన తప్పదని హెజ్‌బొల్లా నాయకుడు హసన్‌ నజరుల్లా మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు.

నేడూ, రేపూ గగనతల ఆంక్షలు : ఈ నెల 7, 8 తేదీల్లో సైనిక విన్యాసాలు చేపడుతున్న నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్‌ వైమానిక సంస్థ ఎన్‌వోటీఎంను తెలిపింది. ఇరాన్ గగనతలం నుంచి గగనతలంలోకి దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలు చేపట్టనుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 నుంచి మధ్యహ్నం 2.30 వరకూ గురువారం తెల్లవారుజామున 4.30 నుంచి ఉదయం 7.30 వరకూ సైనిక విన్యాసాలు జరుగనున్నాయి.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి : దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా దక్షిణ ఫ్రంట్‌ దళం ప్రాంతీయ కమాండ్‌గా వినియోగిస్తున్న భవనంపై భారీ వైమానిక దాడి నిర్వహించినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హెచ్‌బొల్లాకు చెందిన ఖియాంలోని ఓ భవనంపై దాడులకు దిగింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

హమాస్‌ అధిపతిగా సిన్వర్‌ : ఇటీవల మరణించిన పొలిటికల్‌ బ్యూరో అధినేత ఇస్మాయిల్‌ హనియె స్థానంలో యహ్యా సిన్వర్‌ను హమాస్‌ ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన వెలువరించింది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న జరిగిన దాడులకు అతనే ప్రధాన సూత్రధారి.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్​ - Yunus as head of Bangladesh govt

ట్రంప్ సరదాగా డాన్స్​ చేస్తే - ప్రచార ఉల్లంఘన అంటున్నారు - కారణం ఏమిటి? - Donald Trump Costly Gifts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.