Russia Helicopter Missing : రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. వీరిలో 19మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, Mi-8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ కమ్‌చత్కా ద్వీపకల్పంలో వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి బయలుదేరంది. అయితే షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదని ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
డబుల్ కలిగిన ఇంజిన్ ఈ Mi-8 శ్రేణి హెలికాప్టర్‌ను 1960ల్లో డిజైన్ చేశారు. ఈ మోడల్‌ను రష్యా, పొరుగు దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తుంటారు. ఈ ఆగస్టులో కూడా కమ్‌చత్కాలో ఇటువంటి హెలికాప్టరే 16 మంది ప్రయాణికులతో సహా కుప్పకూలిపోయింది. ఈ హెలికాప్టర్‌ను విట్యజ్ ఏరో కంపెనీ నిర్వహిస్తోంది. ఈ హెలికాప్టర్ నాడు మాస్కో నుంచి పర్యటకులను సెయింట్ పీటర్స్ బర్గ్‌కు తరలిస్తోందని ప్రభుత్వ రంగ న్యూస్ ఏజెన్సీ ఆర్‌ఐఏ పేర్కొంది.
ఆకాశంలో 'భూకంపం'- విమానంలో ఒకరు మృతి, అనేక మందికి గాయాలు
ఇటీవల సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు లోనైంది. దీంతో ఒక వ్యక్తి మరణించగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. మే20న 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో SQ321 విమానం లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్ తీవ్ర కుదుపులకు లోనుకావడం వల్ల దాన్ని థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించారు.
గాల్లో ఊడిన విమానం టైరు- గగనతలంలో ప్రయాణికులు టెన్షన్ టెన్షన్- ఆఖరికి!
ఇటీవల అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యూనైటైడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే విమానం ఎడమ భాగంలోని టైరు ఊడిపోయింది. వెంటనే విమానాన్ని పైలెట్లు లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అసలేమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు- అంతా హడల్! ఆ పక్షి వల్లేనా?
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం - స్పాట్లోనే 61 మంది మృతి - Plane Crash In Brazil