ETV Bharat / international

రష్యా రక్షణ మంత్రి షోయగు తొలగింపు- కొత్త డిఫెన్స్​ మినిస్టర్​గా ఆండ్రీ బెలౌసోవ్- పుతిన్ కీలక నిర్ణయం - Putin Changed defence minister - PUTIN CHANGED DEFENCE MINISTER

Putin Changed Russia defence minister : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయగును తొలగించి, ఆ ప్లేస్​లో ఆండ్రీ బెలౌసోవ్​ను నియమించారు. కాగా షోయగుకు రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.

Andrei Belousov
Andrei Belousov (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 7:51 AM IST

Updated : May 13, 2024, 8:38 AM IST

Putin Changed Russia Defence Minister : ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణమంత్రి సెర్గీ షోయిగును తొలగించి ఆ స్థానంలో ఆండ్రీ బెలౌసోవ్‌ను నియమించారు. షోయిగుకు రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ- ఇండస్ట్రియల్ కమిషన్‌లో పుతిన్‌కు ఆయన డిప్యూటీగా ఉండనున్నారు. ఆండ్రీ బెలౌసోవ్‌ను రక్షణమంత్రిని చేయడమనేది భద్రతా కూటమి ఆర్థిక వ్యవస్థను దేశ ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయాల్సిన అవసరంతో ముడిపడి ఉందని క్రెమ్లిన్‌ ప్రతినిధి చెప్పారు. బెలూసోవ్ గతంలో రష్యా ఉప ప్రధానిగా, దేశాధినేత సలహాదారుడిగా, ప్రభుత్వ ఆర్థిక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
గత ఏడాది సెప్టెంబరులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా రక్షణ మంత్రిగా ఒలెక్సీ రెజ్నికోవ్‌ను తొలగించి, రుస్టెమ్ ఉమెరోవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వాలెరి జలుజ్నీ స్థానంలో ఒలెక్సాండర్ సిర్‌స్కీని నియమించారు.

రష్యాపై ఉక్రెయిన్ దాడి- 13మంది మృతి
ఇదిలా ఉండగా, రష్యా సరిహద్దు నగరం బెల్గోరోడ్‌లో ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌ సైన్యాలు ప్రయోగించిన మోర్టార్‌షెల్స్‌ కారణంగా 10 అంతస్తుల ఒక అపార్ట్‌మెంట్‌ను పాక్షికంగా కూలిపోయింది. 20 మంది పౌరులు గాయపడ్డారు. భవన పైకప్పు కూలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న రష్యా అత్యవసర ప్రతిస్పందనా దళం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించింది. బెల్గోరోడ్ గగనతలంలో ఉక్రెయిన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులను, 2 డ్రోన్లను తమ రక్షణ దళాలు కూల్చివేశాయని, రష్యా ప్రకటించింది. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

కాగా పశ్చిమ రష్యా నగరాలను కొంతకాలంగా ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకుంటోంది. 2023 మే నెల నుంచి ఈ ప్రాంతంలోని నగరాలపై ఉక్రెయిన్​ డ్రోన్​ దాడులకు పాల్పడుతోందని రష్యా అధికారులు చెబుతున్నారు. అయితే రష్యా భూభాగంపై, క్రిమియా ద్వీపకల్పంపై దాడులకు ఎప్పుడూ ఉక్రెయిన్ బాధ్యత వహించలేదు. ఇక, రష్యా పశ్చిమ సరిహద్దులోని బెల్గోరోడ్ ప్రాంతం ఎక్కువగా దాడులకు గురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో షెల్లింగ్​ ఎక్కువగా కనిపిస్తోంది. డిసెంబర్​ 2023లో బెల్గోరోడ్​ నగరం నడిబొడ్డున జరిగిన షెల్లింగ్​లో 25మంద్రి మృతి చెందారు.

శభాష్​ 'ఎవరెస్ట్ మ్యాన్‌'!- 29వసారి ఎవరెస్టును అధిరోహించిన కమీ రీటా - Kami Rita Climbs Mt Everest

'POKను భారత్​లో కలపండి'- పౌరుల ఆందోళనలు- పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఏం జరుగుతోంది? - pok protest today

Last Updated : May 13, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.