PM Modi Russia Ukraine Visit : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీని రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు ఆహ్వానించారు. ఎన్నికల తర్వాత పర్యటన చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. అయితే బుధవారం పుతిన్, జెలెన్‌స్కీతో మోదీ ఫోన్‌లో మట్లాడారు. ఆ సమయంలో ఇరువురు అధ్యక్షులు మోదీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌కు విషెస్ చెప్పారు మోదీ. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని ఉద్ఘాటించారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఫోన్ మాట్లాడారు మోదీ. సంక్షోభ ముగింపునకు భారత్ తనవంతు కృషి చేస్తుందని, మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.
పుతిన్‌కు మోదీ విషస్
భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు అంగీకరించామని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా సుదీర్ఘంగా పుతిన్, మోదీ చర్చించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇదే అంశంపై అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కూడా స్పందించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొంటూ, మోదీకి శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది.
-
Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia
— Narendra Modi (@narendramodi) March 20, 2024
ఉక్రెయిన్‌కు మోదీ భరోసా!
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం భారత్ అన్నివిధాలా కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో మనవతా సహాయాన్ని భారత్ కొనసాగిస్తుందన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించిన మోదీ- సంప్రదింపులు, దౌత్యమార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చెప్పినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఒకేరోజు రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మోదీ సంభాషించడం గమనార్హం.
-
Had a good conversation with President @ZelenskyyUa on strengthening the India-Ukraine partnership. Conveyed India’s consistent support for all efforts for peace and bringing an early end to the ongoing conflict. India will continue to provide humanitarian assistance guided by…
— Narendra Modi (@narendramodi) March 20, 2024
మోదీ భూటాన్ పర్యటన వాయిదా
Modi Bhutan Visit : మరోవైపు, ప్రధాని మోదీ భూటాన్ పర్యటన తాత్కాలికంగా రద్దైంది. ప్రతికూల వాతావరణం కారణంగా మోదీ పర్యటన వాయిదా పడినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. అయితే మార్చి 21-22 తేదీల్లో మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉంది. భూటాన్ ప్రధాని టోబ్‌గే గతవారం భారత్‌లో పర్యటించారు. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
-
"Due to ongoing inclement weather conditions over Paro airport, it has been mutually decided to postpone the State visit of Prime Minister to Bhutan on 21-22 March 2024. New dates are being worked out by the two sides through diplomatic channels," reads a press release by… pic.twitter.com/TMlS7azLkB
— Press Trust of India (@PTI_News) March 20, 2024
'రాజకీయ లబ్ధి కోసమే నా మాటలను మోదీ వక్రీకరించారు'- 'శక్తి' వ్యాఖ్యలపై రాహుల్ క్లారిటీ
పార్టీ నేతను గుర్తుచేసుకుని మోదీ ఎమోషనల్- DMK, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని!