ETV Bharat / international

పండుగ​ వేళ విషాదం- బస్సు లోయలో పడి 17మంది భక్తులు దుర్మరణం- 38మందికి గాయాలు - Pakistan Road Accident - PAKISTAN ROAD ACCIDENT

Pakistan Road Accident : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan Road Accident
Pakistan Road Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 10:08 AM IST

Updated : Apr 11, 2024, 1:06 PM IST

Pakistan Road Accident : పాకిస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బలూచిస్థాన్​ ప్రావిన్స్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కరాచీలోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పలువురు ముస్లిం యాత్రికుల బృందంతో ఓ బస్సు తట్ట ప్రాంతం నుంచి బయలుదేరింది. వీరంతా రంజాన్​ పండుగను పురస్కరించుకొని బలూచిస్థాన్‌ ప్రావిన్స్​ ఖుజ్దార్​ జిల్లాలోని ఉన్న మారుమూల సూఫీ పుణ్యక్షేత్రమైన షా నూరానీ దర్శనం కోసం వెళ్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వీరి బస్సు సింధ్​-బలూచిస్థాన్​ ప్రావిన్సుల సరిహద్దు పట్టణ సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

'ఒకే కుటుంబాలకు చెందినవారు'
ఈ ప్రమాద దుర్ఘటనపై పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహ్​సిన్ నఖ్వీ విచారం వ్యక్తం చేశారు.​ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'సూఫీ పుణ్యక్షేత్రం సందర్శనం కోసం వెళ్తున్న ఓ భక్తుల బృందం బస్సు బుధవారం రాత్రి హబ్​ పట్టణంలో ప్రమాదానికి గురైంది. వీరి బస్సు అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఓ లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం కరాచీకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సింధ్​ ప్రావిన్స్‌లోని థాట్టా పట్టణానికి చెందినవారిగా గుర్తించాం. వీరిలో కొందరు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది' అని నఖ్వీ చెప్పారు. మలుపు వద్ద​ డ్రైవర్​ నియంత్రణను కోల్పోవడం వల్లే బస్సు అదుపుతప్పి లోయలో పడి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు.

పడవ బోల్తా- 90 మంది మృతి!
ఇదిలాఉంటే ఇటీవలే ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో ప్రమాదవశాత్తూ పడవ మునగడం వల్ల సుమారు 90 మందికిపైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారాలు తెలిపారు.

కలరా భయంతో పడవలో 130మంది జర్నీ- నీటమునిగి 90మందికిపైగా మృతి - Mozambique Boat Accident

41 సెకన్లు, 100 బుల్లెట్లు- నల్లజాతీయుడిపై కాల్పులు- అమెరికాలో కలకలం - youth died in police firing in us

Last Updated : Apr 11, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.