Pak Coalition Government : పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) ఛైర్మన్ బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్(PML-N) తో ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని పదవిని పంచుకోబోమని వెల్లడించారు. ప్రజల మద్దతు లేకుండా ఆ పదవిని చేపట్టబోనని భుట్టో ప్రకటించారు. మూడేళ్లు PML-N రెండేళ్లు పీపీపీ ప్రధాని పదవిని పంచుకోవాలనే ప్రతిపాదన రాగ, దాన్ని తాను వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాను ప్రధాని కావాలనుకుంటే అది ప్రజలు ఎన్నుకున్న తర్వాతనే అని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై PPP, PML-N పార్టీల మధ్య మూడు విడతలు చర్చలు జరిగినా అవి అసంపూర్తిగానే ముగిశాయి. నాలుగోసారి అధికార పంపణిపై ఇరు పార్టీలు భేటీ కానున్నాయి.
265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీకి కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో 75 స్థానాలు గెలుచుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించింది. 54 స్థానాలు గెలిచిన పీపీపీ, 17 సీట్లు కైవసం చేసుకున్న ముత్తహిదా ఖ్వామి మువ్‌మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) నవాజ్ పార్టీతో జత కలిసి సంకీర్ణం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)కు మద్దతుగా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాలు దక్కించుకున్నారు. ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచి మద్దతు ఇస్తామంటున్న బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ దేశాధ్యక్ష స్థానం, స్పీకర్ వంటి రాజ్యాంగ పదవులను కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే పాకిస్థాన్ ముస్లింలీగ్- నవాజ్‌తో ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని పదవిని పంచుకోమని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ఆ పదవిని చేపట్టబోనని భుట్టో వెల్లడించారు.
బ్యూరోక్రాట్ రాజీనామా
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఇటీవలే మరోసారి బయటపడింది. ఎన్నికల్లో అక్రమాల వల్లే తాము గెలిచామంటూ రెండు స్థానాలను మూడు పార్టీలు వదులుకోగా తాజాగా ఎన్నికల్లో అక్రమాలు నిజమేనని ఓ బ్యూరోక్రాట్ ప్రకటించారు. నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల అక్రమాల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్, చీఫ్ జస్టిస్‌కు ప్రమేయం ఉందని రావల్పిండి మాజీ ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు.
కుమార్తె కోసం ప్రధాని పదవి త్యాగం!- సైన్యానికి తలొగ్గిన నవాజ్ షరీఫ్