Biden On Trump Incident : అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఖండించారు. ''ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి. ఇటువంటి ఘటనలు, హింసాకాండలు జరగడానికి మేం అనుమతించలేం. ఇలాంటి నేరాలను ఉపేక్షించలేం. ఈ తరహా ఆగడాలకు తెగబడే వారిని క్షమించలేం'' అని బైడెన్ స్పష్టం చేశారు. వారాంతం కావడం వల్ల ప్రస్తుతం డెలావేర్‌లోని తన రెహోబోత్ బీచ్ హౌస్‌లో ఆయన ఉన్నారు. ట్రంప్‌పై దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే బైడెన్ వెంటనే మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అన్ని భద్రతా విభాగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Rehoboth Beach, Delaware | US President Joe Biden says, " i've been thoroughly briefed by all the agencies in the federal government as to the situation based on what we know now, i have tried to get hold of donald, he's with his doctors and doing well. i plan on talking… pic.twitter.com/eig6fcu4Hu
— ANI (@ANI) July 14, 2024
ట్రంప్ బాగానే ఉన్నారు!
ఇక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడి ఆరోగ్య వివరాలను బైడెన్ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికార వర్గాలు వెెల్లడించాయి. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, బట్లర్ నగర మేయర్ బాబ్ దండోయ్‌లతో కూడా బైడెన్ మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ''ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు. ఆయనతో నేను కొన్ని గంటల క్రితమే మాట్లాడాను. ఇది హత్యాయత్నమా? కాదా ? అనేది తెలియాలంటే ఇంకొంత దర్యాప్తు జరగాలి. వాస్తవం ఏమిటో నాకు కూడా తెలియదు'' అని బైడెన్ చెప్పారు.
I have been briefed on the shooting at Donald Trump’s rally in Pennsylvania.
— President Biden (@POTUS) July 13, 2024
I’m grateful to hear that he’s safe and doing well. I’m praying for him and his family and for all those who were at the rally, as we await further information.
Jill and I are grateful to the Secret…
మరోవైపు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డైరెక్టర్ కింబర్లీ చీటుల్, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాండ్రో మయోర్కస్, హోం ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ లిజ్ షెర్వుడ్ రాండాల్, అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రేలు బైడెన్‌కు ఈ ఘటనపై సమాచారాన్ని అందించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకొని వైట్‌హౌస్‌కు బైడెన్ చేరుకోనున్నారు. అనంతరం అన్ని భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై ట్రంప్‌పై జరిగిన దాడి ఘటనపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షించనున్నారు. ఈ కేసుపై దర్యాప్తును ప్రారంభించామని ఎఫ్‌బీఐ ప్రకటించింది.
I have been briefed on the shooting at former President Trump’s event in Pennsylvania.
— Vice President Kamala Harris (@VP) July 14, 2024
Doug and I are relieved that he is not seriously injured. We are praying for him, his family, and all those who have been injured and impacted by this senseless shooting.
We are grateful to…
ప్రముఖుల స్పందన
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. '' ఈ అసహ్యకరమైన చర్యను మనమందరం ఖండించాలి. ఈ ఘటన మరింత హింసకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది'' అని కమలా హ్యారిస్ తెలిపారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ట్రంప్ వేగంగా కోలుకోవాలని బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని ఒబామా అన్నారు. ''ట్రంప్‌పై దాడి పిరికిపందల చర్య. సీక్రెట్ సర్వీసు విభాగం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ ప్రాణాలు నిలిపారు'' అని జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ పేర్కొన్నారు. మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి సైతం ఈ ఘటనను ఖండించారు. అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దీనిపై స్పందిస్తూ, ఈ ఘటనను తమ శాఖ తరఫున ఖండించారు. అమెరికాలో మన విభేదాలను మనం పరిష్కరించుకునే మార్గం ఇది కాదన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం సరికాదని లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ట్రంప్ క్షేమంగానే ఉన్నారని తెలుస్తోందని, ఆయన బాగానే ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆస్టిన్ తెలిపారు.
There is absolutely no place for political violence in our democracy. Although we don’t yet know exactly what happened, we should all be relieved that former President Trump wasn’t seriously hurt, and use this moment to recommit ourselves to civility and respect in our politics.…
— Barack Obama (@BarackObama) July 13, 2024
ఖర్గే, రాహుల్ స్పందన ఇదీ!
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఏ దేశంలోనైనా ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా ఏ నాగరిక సమాజంలోనైనా ఇలాంటి ఘటనలు జరగకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ట్రంప్‌పై దాడి జరిగిందన్న వార్తను తెలుసుకొని తాము ఆందోళనకు గురయ్యామని రాహుల్ గాంధీ తెలిపారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ''ఈ క్లిష్ట సమయంలో భారతదేశం అమెరికన్ ప్రజలకు అండగా నిలుస్తోంది. మరణించిన వారి కుటుంబానికి మేం మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం'' అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే పేర్కొన్నారు.
I am deeply concerned by the assassination attempt on former US President Donald Trump.
— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2024
Such acts must be condemned in the strongest possible terms.
Wishing him a swift and complete recovery.
Deeply appalled by the attack on former US President Donald Trump.
— Mallikarjun Kharge (@kharge) July 14, 2024
I strongly condemn this heinous act.
Such violence has no place in any Democracy and civilised society.
As India stands with the American people, we offer our deepest condolences the family of the deceased.
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం- ర్యాలీలో మాట్లాడుతుండగా కాల్పులు - Donald Trump Attacked