ETV Bharat / international

టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం- 18మంది మృతి - Nepal Plane Crash - NEPAL PLANE CRASH

Nepal Plane Crash : నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. త్రిభువన్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ తీసుకొనే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలి 18మంది మృతి చెందారు.

Nepal Plane Crash
Nepal Plane Crash (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 12:17 PM IST

Updated : Jul 24, 2024, 1:24 PM IST

Nepal Plane Crash : నేపాల్​లో జరిగిన విమాన ప్రమాదంలో 18మంది మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాజధాని నగరం కాఠ్‌మండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అవుతుండగా జరిగింది.

బుధవారం ఉదయం 11 గంటలకు శౌర్య ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం కాఠ్​మాండూ నుంచి పొఖారాకు బయలుదేరింది. రన్​వేపై నుంచి టేకాఫ్​ అవుతుండగానే ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంతో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. ప్రమాదానికి ముందు విమానం కూలుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సయమంలో విమానంలో మొత్తం సిబ్బందితో సహా 19మంది ఉన్నారు. పైలట్​ మినహా విమానంలో 18మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన మరో పైలట్​ను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో నేపాల్‌తో పాటు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడింది.

Last Updated : Jul 24, 2024, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.