ETV Bharat / international

షేక్ హసీనాపై కేసు నమోదు- అతడి హత్య విషయంలోనే! - Murder case On Sheikh Hasina

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 3:22 PM IST

Murder Case On Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. రిజర్వేషన్ల కోసం జులై 19న జరిగిన అల్లర్లలో అబూ సయ్యద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యలు హసీనాతో పాటుగా మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశారు.

Murder Case Filed Against Bangladesh Ex-PM
Murder Case Filed Against Bangladesh Ex-PM (Associated Press)

Murder Case On Hasina : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై మొదలైన రగడ ఇంకా కొనసాగుతోంది. ఆ దేశంలో తాత్కాలిక ప్రధానిని ఎన్నుకున్నా ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. ప్రధాని పదవిని వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటుగా మరో ఆరుగురిపైన కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రిజర్వేషన్ల అంశంపై మొదలైన అల్లర్లతో బంగ్లాదేశ్‌ను నిప్పుల కుంపటిలా తయారైంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కూడా వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 550కి పైగా చేరుకుంది. ఈ క్రమంలో గత జూలై 19న మొహమ్మద్‌పుర్‌లోని జరిగిన అల్లర్లలో అబుసయ్యద్‌ అనే ఓ కిరాణ దుకాణ యజమాని మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్‌ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్‌ కుటుంబ సభ్యుల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపైన కూడా కేసు నమోదైంది. నిందితుల్లో అవామీ లీగ్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఒబైదుల్‌ క్వాడర్‌, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమల్‌, మాజీ ఐజీ అబ్దుల్లా అల్‌ మామున్‌ సహా మరికొందరు పేర్లు ఉన్నాయి.

కాగా, రిజర్వేషన్లకు రద్దుచేసి ప్రతిభకు పట్టం కట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల బంగ్లాదేశ్‌ అగ్నిగుండంలా తయారైంది. దీంతో అవామీ లీగ్‌ నేతృత్వంలోనే ప్రభుత్వం కూలిపోయింది. అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాలో సైన్యం సహాయంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్‌ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నంత మాత్రాన ఆదేశంతో తమ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినవని బంగ్లాదేశ్​లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణస్వీకారం చేశారు.

'రాక్షసి వెళ్లిపోయింది' - హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య - Yunus Comments On Hasina

'బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోలేదు'- వైట్ హౌస్ క్లారిటీ - Bangladesh Political Crisis

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.