ETV Bharat / international

కెనడాలో హిందువులపై ఖలిస్థానీ తీవ్రవాదుల దాడి- తీవ్రంగా స్పందించిన భారత్

కెనడాలో ఖలిస్థానీల మరో దుశ్చర్య- హిందూ దేవాలయం లక్ష్యంగా భక్తులపై దాడి- తీవ్రంగా స్పందించిన భారత్​- ఘటనను ఖండించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

Khalistani Attack Brampton Hindu Temple
Khalistani Attack Brampton Hindu Temple (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 21 hours ago

Khalistani Attack Brampton Hindu Temple : కెనడాలో ఖలిస్థానీల దుశ్చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మరో దారుణానికి పాల్పడ్డారు. తాజాగా బ్రాంప్టన్​ ప్రాంతంలోని ఓ హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి, అక్కడికి వచ్చిన భక్తులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటం వల్ల కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో స్పందించారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కెనడియన్​కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కు ఉందని అన్నారు. ఈ ఘటనపై వేగంగా స్పందించినందుకు స్థానిక అధికారులు ట్రూడో ఎక్స్​లో ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తచేసింది.

'కెనడాలో హింసాత్మక తీవ్రవాదం- ఈ ఘటనే సాక్ష్యం'
ఖలిస్థానీలు చేసిన దాడిపై కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా స్పందించారు. కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందని మండిపడ్డారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోకి కూడా చొరబడ్డాయని ఆయన ఆరోపిణలు గుప్పించారు.

'తీవ్రవాదులకు కెనడా సేఫ్​ ప్లేస్​'
ఎంపీ కెవిన్‌ వూంగ్‌ స్పందిస్తూ తీవ్రవాదులకు కెనడా సేఫ్​ ప్లేస్​గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. "హిందువులు, క్రిస్టియన్లు, యూదులను రక్షించడంలో మన నాయకులు విఫలమయ్యారు" అని మండిపడ్డారు.

'బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'
ఈ దాడులకు తెగబడిన వారిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకొంటామని బ్రాంప్టన్‌ మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌ చెప్పారు. మత స్వేచ్ఛ అనేది కెనడా మౌలిక విలువలకు గుర్తు అని అన్నారు. ప్రతిఒక్కరూ వారి ప్రార్థన మందిరాల వద్ద సురక్షితంగా ఉండాలని అన్నారు. ఒంటారియో సిఖ్స్‌ అండ్‌ గురుద్వారా కౌన్సిల్‌ కూడా ఈ హింసను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. హింసకు తమ మతంలో స్థానంలో లేదని పేర్కొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరింది.
గత కొన్ని నెలలుగా కెనడాలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. 2023లో విండ్‌సోర్‌లోని ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాశారు దుండగులు.

తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన హై కమిషన్
బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం బయట నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంప్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం తీవ్ర నిరాశపరిచిందని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ తెలిపింది. దీని వెనక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందని ఆరోపించింది. "గతంలో జరిగినట్లే ఒట్టావాలోని హై కమిషన్, వాంకోవర్, టొరంటోలోని భారత కాన్సులేట్లు సాధారణ కార్యకలాపాల నిమిత్తం క్యాంప్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భద్రత అందించాలని మేం ముందుగానే కెనడా అధికారులను అభ్యర్థించాం. భారత వ్యతిరేక శక్తుల దాడితో మా క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈ చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. భారత పౌరుల భద్రత పట్ల తీవ్ర ఆందోళనగా ఉన్నాం. వాంకోవర్‌లో కూడా నవంబర్ 2-3 తేదీల్లో ఇదే తరహా యత్నాలు జరిగాయి. అయినా మా కార్యకలాపాలు కొనసాగించగలిగాం" అని భారత హై కమిషన్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇలాంటి ఘటనలతో పాటు భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తోన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ఆధారంగా ఈ క్యాంపుల నిర్వహణ ఉంటుందని వెల్లడించింది.

'నేను అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగనివ్వను'
బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పీల్ రీజనల్‌ పోలీస్‌ విభాగం ప్రతినిధి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తాము ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. ఘర్షణలకు కారణాలు కూడా చెప్పలేకపోయారు. ప్రతిఒక్కరికి వారి మతవిశ్వాసాలను పాటించే స్వేచ్ఛ ఉందని కెనడా ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.