ETV Bharat / international

హష్‌ మనీ కేసులో ట్రంప్‌నకు భారీ షాక్‌ - ఇక శిక్ష తప్పదా? - TRUMP HUSH MONEY CASE

హష్‌ మనీ ట్రంప్​నకు ఎదురుదెబ్బ - ప్రైవేట్ వ్యవహారాల్లో దేశ అధ్యక్షులకు ప్రత్యేక రక్షణ ఉండదని స్పష్టం చేసిన కోర్ట్

Trump Hush Money Case
Trump Hush Money Case (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2024, 9:25 AM IST

Trump Hush Money Case : డొనాల్డ్‌ ట్రంప్‌నకు హష్ మనీ కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌ స్టార్‌కు డబ్బులు ఇచ్చినట్లు ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్‌ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని, ప్రైవేట్​ వ్యవహారాల్లో ఎలాంటి రక్షణ ఉండదని - మన్‌హట్టన్‌ న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ స్పష్టంచేశారు.

శిక్ష తప్పదా?
హష్‌ మనీ కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే దోషిగా తేలారు. ఈ ఏడాది నవంబరులోనే న్యూయార్క్‌ కోర్టు ఈ విషయంలో శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. దీంతో - అమెరికా అధ్యక్షులకు ప్రత్యేక రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. తాజాగా ట్రంప్‌నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. దీంతో ఈ కేసు ఇకపై ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏంటీ హష్‌ మనీ కేసు?
శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ప్రధానమైన ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది మరో ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్‌ కూడా స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.