ETV Bharat / international

లెబనాన్​పై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులు- మేయర్​ సహా 20 మంది మృతి!

లెబనాన్‌లో బుధవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేయర్‌ సహా ఐదుగురు మృతి - ఆరు రోజుల తర్వాత బీరుట్‌పై వైమానిక దాడులతో మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Israeli Attack Lebanon
Israeli Attack Lebanon (Associated Press)

Israeli Attack Lebanon : లెబనాన్‌లో వైమానిక దాడులపై అమెరికా అభ్యంతరం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం విరుచుకుపడుతోంది. హెజ్‌బొల్లా స్థావరాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా దాడుల తీవ్రతను బుధవారం మరింత పెంచింది. 6 రోజుల తర్వాత బీరుట్‌లోని దక్షిణ ప్రాంతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపింది. బీరుట్‌లో నివాస భవనం కింద ఉన్న హెజ్​బొల్లా ఆయుధ గోదాంపై దాడి చేసినట్లు IDF ప్రకటించింది. ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ఎక్స్‌లో హెచ్చరిక పోస్టు చేసిన గంట తర్వాత మొదటి దాడి జరిగింది. అనంతరం మరో రెండు దాడులు జరిపింది.

నబతిహ్‌ మున్సిపాలిటీ భవనంపై జరిగిన దాడిలో మేయర్‌ సహా ఐదుగురు మృతి చెందారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై సమావేశం జరుగుతుండగా IDF దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఇదిలా ఉండగా, బీరుట్‌పై దాడులు తగ్గుతాయని అమెరికా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతంగా సాగుతున్నట్లు లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నబతిహ్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో 11 దాడులు జరిగినట్లు గవర్నర్‌ తెలిపారు.

ఇక, మంగళవారం పొద్దుపోయిన తర్వాత లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగినట్లు లెబనాన్‌ అధికారులు తెలిపారు. భవనాల శిథిలాల కింద నుంచి 15 మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తమ భూభాగంపై 90రాకెట్లతో హెజ్‌బొల్లా దాడులు చేసినట్లు IDF ప్రకటించింది. ఈ దాడులు ఏ ప్రాంతంపై జరిగాయనేది వెల్లడించలేదు.

మరోవైపు రెండ్రోజుల క్రితం ఉత్తర లెబనాన్‌లోని అపార్ట్‌మెంటుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 12 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 22 మంది చనిపోయారు.ఈ ఘటనపై ఐరాస మానవహక్కుల సంస్థ స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

ఇరాన్​లో ఆ ప్రాంతాలపై దాడులు చేయం : నెతన్యాహు
మరోవైపు, ఇరాన్‌పై ప్రతిదాడుల్లో భాగంగా అక్కడి అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హామీ ఇచ్చినట్లు పలు వార్తలు వచ్చాయి. వీటిని అమెరికా ధ్రువీకరించింది. నెతన్యాహు హామీ ఇవ్వడం నిజమేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో గాజా పౌరులకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే సైనిక సాయంలో కోత తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ - మిషిగన్ ఓటర్లు ఎవరివైపు?

సెంట్రల్ గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - చిన్నారులు సహా 20 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.