ETV Bharat / international

'ఇతరుల వనరులు లాక్కోవాలని మాకు లేదు'- గయానా పార్లమెంట్​లో చైనాకు మోదీ చురకలు! - PM MODI PARLIAMENT OF GUYANA

తమకు ఇతరుల వనరులు లాక్కోవాలని లేదన్న ప్రధాని నరేంద్ర మోదీ - ఒక దేశం, ఒక ప్రాంతం వెనుకబడి ఉంటే ప్రపంచ లక్ష్యాలు ఎప్పటికీ సాధించలేమని వ్యాఖ్య- గయానా పార్లమెంట్​లో మోదీ ప్రసంగం

PM Modi Address Parliament of Guyana
PM Modi Address Parliament of Guyana (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 7:05 AM IST

Updated : Nov 22, 2024, 7:12 AM IST

PM Modi Address Parliament of Guyana : విస్తరణవాద ఆలోచనతో భారత్ ఎప్పుడూ ముందుకు సాగలేదని ఇతరుల వనరులను లాక్కోవాలనే భావనకు ఎప్పుడూ దూరంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. గయానా పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మోదీ ప్రసంగించారు. చైనా విస్తరణ ధోరణిపై ప్రపంచ దేశాల ఆందోళనల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌- గయానాల మధ్య బలమైన బంధముందన్న ఆయన రెండు దేశాలూ ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, విభేదాలకు దారితీసే పరిస్థితులను గుర్తించి వాటిని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిపై పోరాడడం ద్వారానే రాబోయే తరాల భవిష్యత్తును తీర్చిదిద్దగలమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత్‌ ఎల్లప్పుడూ సూత్రాలు, విశ్వాసం, పారదర్శకత ఆధారంగా మాట్లాడుతుందని ఒక దేశం, ఒక ప్రాంతం వెనుకబడి ఉంటే ప్రపంచ లక్ష్యాలు ఎప్పటికీ సాధించలేమని వివరించారు.

ప్రధాని సమక్షంలో రామ్​ భజన
గయానాలోని మహాత్మ గాంధీ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. "మహాత్ముడి కాలాతీత విలువలు మానవాళికి బలం, హోప్​ను ఇస్తాయి. ఆయన ఆలోచనలు ఈ భూమండలాన్ని స్థిరంగా మార్చడానికి పరిష్కారాలు అందిస్తాయి." అని మోదీ అన్నారు. జార్జ్​టౌన్​లో కొంతమంది ప్రధాని సమక్షంలో రామ్​ భజన నిర్వహించారు. తాళం కొడుతూ ఉత్సాహంగా భజనలో పాల్గొన్నారు.

భారత్​-గయానాను కనెక్ట్​ చేసే CCC
కల్చర్​, క్యుజీన్(cuisine), క్రికెట్​- భారత్​, గయానాను లోతుగా కనెక్ట్ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సారూప్యతలే రెండు దేశాల మధ్య బలమైన పునాది అని చెప్పారు. గురువారం గయానాలో ఓ ప్రవాస భారతీయుల పాల్గొన్న కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గయానా పర్యటనలో ప్రధాని మోదీ- ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్​ అలీతో కలిసి పలువురు వెస్టిండీస్ క్రికెటర్లను కలిశారు. ఈ క్రీడ భారత్-గయానా మధ్య ప్రత్యేకమైన బంధంగా పనిచేస్తుందని అన్నారు.

Last Updated : Nov 22, 2024, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.